పత్తిరైతు ఆత్మహత్య | Cotton farmer commits suicide | Sakshi
Sakshi News home page

పత్తిరైతు ఆత్మహత్య

Oct 3 2015 10:43 AM | Updated on Aug 29 2018 4:16 PM

అప్పుల భారం మరో అన్నదాతను బలితీసుకుంది.

అప్పుల భారం మరో అన్నదాతను బలితీసుకుంది. ఈ ఘటన నల్లగొండ జిల్లా చిట్యాల మండలం ఏపూర్ గ్రామంలో శుక్రవారం రాత్రి జరిగింది. వివరాల్లోకి వెళితే... గ్రామానికి చెందిన కొండ యాదయ్య(50) తనకున్న ఏడెకరాల భూమిలో పత్తిపంట సాగు చేశాడు..

పెట్టుబడి కోసం చేసిన అప్పులు పెరిగిపోవడంతో వాటిని తీర్చే దారి కానరాక శుక్రవారం రాత్రి చేనులోనే పురుగులమందుతాగి ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement