పుష్కర పనుల్లో అవినీతి | Corruption in work of pushkaralu | Sakshi
Sakshi News home page

పుష్కర పనుల్లో అవినీతి

Dec 15 2016 12:43 AM | Updated on Sep 22 2018 8:25 PM

పుష్కర పనుల్లో అవినీతి - Sakshi

పుష్కర పనుల్లో అవినీతి

రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్‌రెడ్డి పుష్కరఘాట్‌ పనుల్లో రూ.4 కోట్ల మేర అవినీతికి పాల్పడ్డారని మాజీ మంత్రి జి.చిన్నారెడ్డి ఆరోపించారు.

నిరంజన్‌పై చిన్నారెడ్డి ఆరోపణ

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్‌రెడ్డి పుష్కరఘాట్‌ పనుల్లో రూ.4 కోట్ల మేర అవినీతికి పాల్పడ్డారని మాజీ మంత్రి జి.చిన్నారెడ్డి ఆరోపించారు. నిరంజన్‌రెడ్డి అధికార పార్టీని, నామినేటెడ్‌ పదవిని ఆసరాగా చేసుకుని పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడుతున్నారని దుయ్యబట్టారు. బుధవారం ఇక్కడ చిన్నారెడ్డి విలేకరులతో మాట్లాడుతూ వనపర్తిలోని కృష్ణవేణి షుగ ర్‌ ఫ్యాక్టరీలో తనకు వాటాలు ఉన్నాయని నిరూపిస్తే వాటిని నిరంజన్‌రెడ్డికి రాసిస్తాన ని ప్రకటించారు.

తాను పోతిరెడ్డిపాడు ప్రాజెక్టును ఏనాడు సమర్థించలేదన్నారు. గతంలో తన పేరుతో ఒక పత్రికలో వచ్చి న వ్యాసం తాను రాసింది కాదని, దానిపై తన సంతకం ఉంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని పురుద్ఘాటించారు. దళితుడిని సీఎం చేస్తానని, ఆ విధంగా చేయకపోతే తల నరుక్కుంటానని ముఖ్యమంత్రి కేసీఆర్‌ సవాల్‌ చేసి మాట తప్పారని అందరూ అలాగే ఉంటారని అనుకోవడం తప్పని అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement