ఖమ్మం క్రైం: దేవాదాయ శాఖలో ఈవోగా పనిచేస్తూ.. తన కిందిస్థాయి సిబ్బంది వద్ద లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిన ఘటన మంగళవారం ఖమ్మంలో చోటుచేసుకుంది. ఏసీబీ డీఎస్పీ సాయిబాబా కథనం ప్రకారం.. వైరా మండలం గొల్లపుడి పులిగుట్ట నరసింహస్వామి ఆలయ ఈవో పెద్ది సత్యనారాయణ నగరంలోని గుంటు మల్లేశ్వరస్వామి దేవస్థానంతోపాటు మరో రెండు దేవాలయాలకు ఇన్‌చార్జి ఈవోగా పనిచేస్తున్నారు. పులిగుట్ట నరసింహస్వామి ఆలయంలో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న దిరిశాల శ్రీనివాస్ సంవత్సర కాలంగా డిప్యుటేషన్‌పై ఖమ్మం వైరారోడ్డులోని జలాంజనేయస్వామి దేవాలయంలో విధులు నిర్వర్తిస్తున్నారు.
ఇటీవల దేవాదాయ శాఖ ఉద్యోగులకు ఆ శాఖ డిప్యూటీ కమిషనర్ 2005 పీఆర్‌సీ విడుదల చేయడంతో దానికి గాను ఆ బిల్లులు రూ.లక్ష విడుదల చేయమని శ్రీనివాస్ ఈవో సత్యనారాయణను కోరాడు. అందుకు ఖర్చవుతుందని, రూ.15 వేలు లంచం ఇవ్వాలని ఈవో చెప్పాడు. తాను నెలకు రూ.7వేల వేతనంతో పనిచేస్తున్నానని, అంత డబ్బు ఇవ్వలేనని, చాలా కష్టాల్లో ఉన్నానని శ్రీనివాస్ బతిమిలాడినా ఈవో ససేమిరా అన్నాడు. కొంతకాలం ఆయన చుట్టూ తిరిగి విసిగి వేసారిన శ్రీనివాస్ ఏసీబీ డీఎస్పీని సంప్రదించాడు. దీంతో డీఎస్పీ సూచన మేరకు సత్యనారాయణకు రూ.10 వేలు లంచం ఇవ్వడానికి ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఆ డబ్బు తీసుకుని గుంటుమల్లన్న స్వామి గుడికి వస్తానని శ్రీనివాస్ చెప్పగా.. తానే జలాంజనేయస్వామి గుడికి వచ్చి తీసుకుంటానని సత్యనారాయణ చెప్పాడు.
కాగా, రూ.1000 నోట్లు పదింటికి పౌడర్ పూసి శ్రీనివాస్‌కు ఇచ్చిన ఏసీబీ సిబ్బంది గుడి ప్రాంతంలో మాటువేశారు. ఈవో ఆలయంలోకి వస్తుండగానే శ్రీనివాస్ గుడి గోడ పక్కన ఉన్న రోడ్డుపై నిల్చుని డబ్బులు ఈవో ఇచ్చాడు. సత్యనారాయణ ఆ డబ్బును జేబులో పెట్టుకుంటుండగానే పక్కనే ఉన్న ఏసీబీ సిబ్బంది రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈవోనుంచి రూ.10 వేల నగదు స్వాధీనం చేసుకుని అతడిని హైదరాబాద్‌లోని ఏసీబీ ప్రత్యేక కోర్టుకు తరలించారు. ఇదిలా ఉండగా, జూనియర్ అసిస్టెంట్ స్థాయి నుంచి వచ్చిన సత్యనారాయణ మొదటి నుంచి లంచాలకు అలవాటు పడి కిందిస్థాయి సిబ్బందిని బాగా వేధిస్తున్నాడని, దీనికితోడు ఆయన పనిచేస్తున్న ఆలయాలకు వచ్చే ఆదాయాన్ని కూడా మాయం చేసేవాడని తోటి సిబ్బంది తెలుపుతున్నారు. ఈ దాడుల్లో డీఎస్పీ సాయిబాబాతోపాటు ఏసీబీ సీఐ సాంబయ్య, శ్రీనివాసరాజు, సిబ్బంది పాపారావు, శ్రీనివాసాచారి, అజీజ్ పాల్గొన్నారు.
దేవాదాయ శాఖలో లంచావతారం
Published Wed, Oct 15 2014 3:13 AM
Advertisement
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్‌పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
మిస్టర్ అండ్ మిసెస్ మహీ చిత్రంలో జాన్వీ.. ధోనిపై ఆసక్తికర కామెంట్స్ చేసిన భామ (ఫొటోలు)
దాక్షాయణి బర్త్ డే.. పుష్ప మేకర్స్ స్పెషల్ అప్డేట్!
దేవర బర్త్ డే ట్రీట్.. అప్డేట్ అదిరిపోయింది!
‘బీజేపీకి ఓటేస్తే నేను జైలుకే’.. కేజ్రీవాల్ ఆసక్తికర వ్యాఖ్యలు
కాంగ్రెస్ రైతు వ్యతిరేక చర్యలు.. రాష్ట్రవ్యాప్త నిరసనకు కేసీఆర్ పిలుపు
మాజీ గవర్నర్ కమలా బెనివాల్ కన్నుమూత
ఇండియా కూటమి గెలిస్తే మద్దతిస్తాం: మమతా బెనర్జీ
కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్.. సాధారణ తీర్పు కాదన్న అమిత్ షా
కాబోయేవాడు ఎలా ఉండాలంటే?.. జాన్వీ కపూర్ ఆసక్తికర కామెంట్స్!
స్లొవేకియా ప్రధానిపై కాల్పులు
తప్పక చదవండి
- ఇండియా కూటమి గెలిస్తే మద్దతిస్తాం: మమతా బెనర్జీ
- పనిమనిషి ఇంట్లో నోట్ల గుట్టలు.. జార్ఖండ్ మంత్రి అలంగిర్ అరెస్టు
- మెగాస్టార్ చిత్రంలో మరో సీనియర్ నటి.. ఆ కాంబో రిపీట్!
- స్టార్ క్రికెటర్ ప్రపోజ్.. హీరోయిన్ ఏమన్నారంటే!
- పంచాయత్ సీజన్ 3 ట్రైలర్ విడుదల
- వడదెబ్బ మరణాలు.. ఐదో వంతు భారత్‌లోనే !
- సచిన్ టెండూల్కర్ సెక్యూరిటీ గార్డు ఆత్మహత్య!
- అతడి కంటే చెత్త కెప్టెన్ ఎవరూ లేరు.. పైగా హార్దిక్‌ను అంటారా?
- పల్నాడు ప్రమాదంపై సీఎం జగన్ దిగ్భ్రాంతి
- BCCI: టీమిండియా హెడ్‌కోచ్‌గా వాళ్లిద్దరిలో ఒకరు?
Advertisement