కార్డన్ సెర్చ్‌.. పోలీసుల అదుపులో రౌడీ షీటర్లు | cordon search in rajendranagar and 60 caught | Sakshi
Sakshi News home page

కార్డన్ సెర్చ్‌.. పోలీసుల అదుపులో రౌడీ షీటర్లు

Sep 13 2015 4:08 PM | Updated on Mar 28 2018 11:11 AM

కార్డన్ సెర్చ్‌.. పోలీసుల అదుపులో రౌడీ షీటర్లు - Sakshi

కార్డన్ సెర్చ్‌.. పోలీసుల అదుపులో రౌడీ షీటర్లు

రాజేంద్రనగర్‌లోని చింతల్‌మెట్ ప్రాంతంలో పోలీసులు ఆదివారం తెల్లవారుజామున కార్డన్ సెర్చ్ నిర్వహించారు.

రాజేంద్రనగర్ (రంగారెడ్డి): రాజేంద్రనగర్‌లోని చింతల్‌మెట్ ప్రాంతంలో పోలీసులు ఆదివారం తెల్లవారుజామున కార్డన్ సెర్చ్ నిర్వహించారు. శంషాబాద్ డీసీపీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో సుమారు 100 మంది పోలీసులు సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా 60 మందిని అదుపులోకి తీసుకున్నారు. అలాగే, పత్రాలు లేకపోవడంతో 50 ద్విచక్ర వాహనాలు, 10 ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ వారిలో నలుగురు రౌడీ షీటర్లు, పది మంది పాత నేరస్తులు ఉన్నారని సమాచారం.

Advertisement
 
Advertisement
Advertisement