తెలంగాణ రాష్ట్ర కాంట్రాక్ట్ విద్యుత్ ఉద్యోగులు సోమవారం నుంచి సమ్మెకు దిగేందుకు తెలంగాణ రాష్ట్ర సిద్ధమైయ్యారు.
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర కాంట్రాక్ట్ విద్యుత్ ఉద్యోగులు సోమవారం నుంచి సమ్మెకు దిగేందుకు సిద్ధమైయ్యారు. ఈ మేరకు విద్యుత్ ఉద్యోగుల సంఘం ఓ ప్రకటన విడుదల చేసింది. కాంట్రాక్ట్ ఉద్యోగులకు నేరుగా ప్రభుత్వం జీతాలు ఇవ్వడం కుదరదని డిస్కంలు తేల్చడంతో కాంట్రాక్ట్ ఉద్యోగులు సమ్మెకు దిగుతున్నారు. తమ ఉద్యోగాలను క్రమబద్దీకరిస్తామని గతంలో రెండుసార్లు హామీ ఇచ్చిన డిస్కంలు ఆ తర్వాత పట్టించుకోలేదని ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేశారు.