కలెక్టరేట్‌లో మిస్‌ఫైర్.. కానిస్టేబుల్ మృతి | Constable Dead, Gun Misfires at District Collectorate | Sakshi
Sakshi News home page

కలెక్టరేట్‌లో మిస్‌ఫైర్.. కానిస్టేబుల్ మృతి

Jul 13 2014 1:16 AM | Updated on Mar 19 2019 5:56 PM

సంగారెడ్డి కలెక్టరేట్‌లోని ట్రెజరీ కార్యాలయంలో తుపాకీ మిస్ ఫైర్ అయిన ఘటనలో ఓ కానిస్టేబుల్ మృతి చెందాడు. ఈ సంఘటన శనివారం ఉదయం 5.55 గంటల ప్రాంతంలో చోటుచేసుకుంది.

సంగారెడ్డి: సంగారెడ్డి కలెక్టరేట్‌లోని ట్రెజరీ కార్యాలయంలో తుపాకీ మిస్ ఫైర్ అయిన ఘటనలో ఓ కానిస్టేబుల్ మృతి చెందాడు. ఈ సంఘటన శనివారం ఉదయం 5.55 గంటల ప్రాంతంలో చోటుచేసుకుంది. సంగారెడ్డి రూరల్ సీఐ శ్యామల వెంకటేశం కథనం మేరకు.. కడప జిల్లా పులివెందుల వాసి అయిన ఎస్ రమేష్ కుమార్‌రెడ్డి (46) ఏఆర్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. ఉద్యోగ రీత్యా సంగారెడ్డి పట్టణంలోని రాజంపేటలో నివాసం ఉంటున్నాడు. శుక్రవారం రాత్రి కలెక్టరేట్‌లోని ట్రెజరీ కార్యాలయంలో విధులు నిర్వర్తించాడు. శనివారం ఉదయం విధులు ముగించుకుని ఇంటికి వెళ్తున్న క్రమంలో తుపాకీని మారుస్తుండగా మిస్ ఫైర్ అయింది. దీంతో బుల్లెట్ రమేష్‌కుమార్‌రెడ్డి గుండెల్లోకి దూసుకెళ్లడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు 1991 బ్యాచ్‌కు చెందిన కానిస్టేబుల్. ఘటనా స్థలాన్ని ఎస్పీ శెముషీ బాజ్‌పాయ్ సందర్శించారు.  

మిస్ ఫైరా? లేక ఆత్మహత్యా?

కానిస్టేబుల్ రమేష్ కుమార్‌రెడ్డి మృతి పలు అనుమానాలకు తావిస్తోంది. మిస్ ఫైరా? లేక ఆత్మహత్యనా? అని పోలీసులు అనుమానిస్తున్నారు. కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల ఆధారంగా పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement