కానిస్టేబుల్ ఆత్మహత్య | constable commits suicide over marital issues | Sakshi
Sakshi News home page

కానిస్టేబుల్ ఆత్మహత్య

Nov 23 2016 10:35 AM | Updated on Mar 19 2019 5:56 PM

కానిస్టేబుల్ ఆత్మహత్య - Sakshi

కానిస్టేబుల్ ఆత్మహత్య

టీఎస్ఎస్పీ కానిస్టేబుల్ పొత్తూరి విజయ్ కుమార్(29) ఆత్మహత్యకు పాల్పడ్డారు.

హైదరాబాద్: టీఎస్ఎస్పీ కానిస్టేబుల్ పొత్తూరి విజయ్ కుమార్(29) ఆత్మహత్యకు పాల్పడ్డారు. విజయ్ కుమార్ సొంత గ్రామం ప్రకాశం జిల్లాలోని స్వర్ణ. ఉద్యోగ రీత్యా కొండాపూర్ బెటాలియన్ క్వార్టర్స్ లోని సీ-18లో నివాసం ఉంటున్న ఆయనకు భార్య సుమతి, ఇద్దరు పిల్లలు నిస్సీ, గిఫ్టీ లు ఉన్నారు. 
 
మంగళవారం రాత్రి ఒంటరిగా గదిలో పడుకున్న విజయ్ కుమార్ లుంగీతో ఫ్యాన్ కు ఉరేసుకుని ప్రాణాలు తీసుకున్నారు. భార్యాభర్తల మధ్య కొద్ది రోజులుగా జరుగుతున్న గొడవలే ఇందుకు కారణమని తెలుస్తోంది. సంఘటనా స్ధలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement