బాత్‌రూంలో జారిపడిన ‘కాకా’ | congress senior leader kaka is Slip in the bathroom | Sakshi
Sakshi News home page

బాత్‌రూంలో జారిపడిన ‘కాకా’

Jun 3 2014 3:22 AM | Updated on Mar 18 2019 9:02 PM

బాత్‌రూంలో జారిపడిన ‘కాకా’ - Sakshi

బాత్‌రూంలో జారిపడిన ‘కాకా’

కాంగ్రెస్ నేత జి.వెంకటస్వామి(కాకా) ప్రమాదవశాత్తు బాత్‌రూంలో జారిపడ్డారు. దీంతో ఆయన కుడికాలు విరిగిపోయింది. ఈ సంఘటన సోమవారం జరిగింది.

విరిగిన కుడికాలు, ఆస్పత్రికి తరలింపు

 శంకర్‌పల్లి,  కాంగ్రెస్ నేత జి.వెంకటస్వామి(కాకా) ప్రమాదవశాత్తు బాత్‌రూంలో జారిపడ్డారు. దీంతో ఆయన కుడికాలు విరిగిపోయింది. ఈ సంఘటన సోమవారం జరిగింది. జి.వెంకటస్వామి రోజు మాదిరిగానే  ఉదయం రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండలం మహరాజ్‌పేట్ గ్రామ శివారులోని తన ఫాంహౌస్‌కు వచ్చారు. సాయంత్రం 4:30 గంటల సమయంలో గదిలో ఉన్న బాత్‌రూంకు వెళ్లిన ఆయన కాలు జారి కిందపడ్డారు. ప్రమాదంలో వెంకటస్వామి కుడికాలు మోకాలి పైభాగంలో ఎముక విరిగిపోయింది. 108లో కేర్ ఆస్పత్రికి తరలించారు.
 

Advertisement
 
Advertisement
Advertisement