నోట్లరద్దుతో ప్రజలకు ఒరిగిందేమీ లేదు | Congress Party Protest rally on note ban | Sakshi
Sakshi News home page

నోట్లరద్దుతో ప్రజలకు ఒరిగిందేమీ లేదు

Nov 9 2017 8:54 AM | Updated on Mar 18 2019 7:55 PM

నల్లగొండ టూటౌన్‌ : ప్రధాని నరేంద్రమోదీ తీసుకున్న నోట్లరద్దు నిర్ణయంతో ప్రజలకు ఒరిగిందేమి లేదని పీసీసీ ప్రధాన కార్యదర్శి, జిల్లా ఇన్‌చార్జి ఎంఆర్‌.వినోద్‌రెడ్డి, నకిరేకల్‌ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. నోట్లను రద్దు చేసి సంవత్సరం అయిన సందర్భంగా కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో బ్లాక్‌డేగా పాటించి నల్లగొండలోని క్లాక్‌టవర్‌ సెంటర్‌ నుంచి ప్రకాశంబజారు మీదుగా కలెక్టరేట్‌ వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్‌ ఎదుట నిరసన వ్యక్తం చేసి మాట్లాడారు. ప్రధానిమోదీ గత ఎన్నికల సమయంలో దేశ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ఘోరవైఫల్యం పొందారన్నారు.నోట్ల రద్దు వలన దేశ ఆర్ధిక వ్యవస్థ పూర్తిగా అతలాకుతలం అయ్యిం దన్నారు. 

అనంతరం ప లు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని డీఆర్వో ఖిమ్యానాయక్‌కు అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు కుంభం కృష్ణారెడ్డి, గుమ్ముల మోహన్‌రెడ్డి,పాశం సంపత్‌రెడ్డి, బొడ్డుపల్లి శ్రీనివాస్, కటికం సత్తయ్యగౌడ్, పెరిక వెంకటేశ్వర్లు, సంకు ధనలక్ష్మి, శంకర్‌నాయక్, జూకూరు రమేష్, వంగూరు లక్ష్మయ్య, అల్లి సుభాష్, మందడి శ్రీనివాస్‌రెడ్డి, లతీఫ్, సమి, సట్టు శంకర్, కిన్నెర అంజి, ఊట్కూరు వెంకట్‌రెడ్డి, జాజుల లింగయ్య, పెరిక హరిప్రసాద్, పిల్లి రమేష్, వెంకన్న పాల్గొన్నారు. 

చీకటి రోజు : సీపీఎం
నల్లగొండ టౌన్‌: పెద్దనోట్లు రద్దు భారతదేశానికి చీకటి రోజని సీపీఎం, సీపీఐ జిల్లా కార్యదర్శులు ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి, పల్లా నర్సింహారెడ్డి అన్నారు. బుధవారం వామపక్షాల జిల్లా కమిటీల ఆధ్వర్యంలో స్థానిక సుభాష్‌ విగ్రహం నుంచి గడియారం సెంటర్‌ వరకు నిరసన ప్రదర్శనను నిర్వహించి కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నగదు రహిత సమాజాన్ని నిర్మిస్తామని చెప్పుకుంటున్న మోదీ బ్యాంకు చార్జీల పేరుతో వినియోగదారులపై భారం మోపుతున్నారని విమర్శించారు. 

నల్లధనాన్ని దేశానికి తీసుకువచ్చే వరకు  ప్రజలు నిర్మాణాత్మకమైన పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వామపక్ష పార్టీల నాయకులు ఎండీ సలీం, వి.నారాయణరెడ్డి, పాలడుగు నాగార్జున, సీహెచ్‌ లక్ష్మినారాయణ, పి.నర్సిరెడ్డి, ఎం.ప్రభావతి, దండెంపల్లి సత్తయ్య, తుమ్మల పద్మ, సరోజ, పల్లా  దేవెందర్‌రెడ్డి, కలకొండ కాంతయ్య, జినుకుంట్ల సోమయ్య, గంజి మురళీధర్, నలపరాజు సైదులు కోట్ల అశోక్‌రెడ్డి, మహేష్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement