రైతులను ఆదుకోవడంలో కేసీఆర్ విఫలం | Congress MLA T.Jeevan reddy open letter to Telangana CM KCR | Sakshi
Sakshi News home page

రైతులను ఆదుకోవడంలో కేసీఆర్ విఫలం

Oct 26 2014 1:24 PM | Updated on Mar 18 2019 8:57 PM

రైతులను ఆదుకోవడంలో కేసీఆర్ విఫలం - Sakshi

రైతులను ఆదుకోవడంలో కేసీఆర్ విఫలం

రాష్ట్రంలో కష్టాల్లో ఉన్న రైతులను ఆదుకోవడంలో తెలంగాణ సీఎం కేసీఆర్ విఫలమయ్యారని కాంగ్రెస్ ఎమ్మెల్యే టి.జీవన్రెడ్డి ఆరోపించారు.

హైదరాబాద్: రాష్ట్రంలో కష్టాల్లో ఉన్న రైతులను ఆదుకోవడంలో తెలంగాణ సీఎం కేసీఆర్ విఫలమయ్యారని కాంగ్రెస్ ఎమ్మెల్యే టి.జీవన్రెడ్డి ఆరోపించారు. అందుకే రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు జరుగుతున్నాయన్నారు. తెలంగాణలోని రైతాంగ సమస్యలపై ఆ రాష్ట్ర సీఎం కేసీఆర్కు జీవన్రెడ్డి ఆదివారం బహిరంగ లేఖ రాశారు. ఇప్పటికైనా రైతులను ఆదుకునేందుకు దృష్టి పెట్టాలని కేసీఆర్కు ఆ లేఖలో హితవు పలికారు.

ధాన్యం క్వింటాలుకు రూ. 100 చొప్పున చెల్లించాలని... అలాగే ఇన్పుట్ సబ్సిడీ ఎకరాకు రూ. 10 వేలు ఇవ్వాలని కేసీఆర్ సర్కార్ను డిమాండ్ చేశారు. ఏపీ నుంచి తెలంగాణకు రావాల్సిన విద్యుత్ అంశంపై ఆ రాష్ట్ర సీఎం చంద్రబాబుపై ఒత్తిడి పెంచేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. అందులోభాగంగా ప్రధాని నరేంద్ర మోడీని కలిసేందుకు అఖిలపక్షాన్ని ఢిల్లీ తీసుకువెళ్లాలని సీఎం కేసీఆర్కు విజ్ఞప్తి చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement