మంత్రి పర్యటన.. కాంగ్రెస్ నాయకుల గృహ నిర్బంధం | Congress leaders house arrested by police | Sakshi
Sakshi News home page

మంత్రి పర్యటన.. కాంగ్రెస్ నాయకుల గృహ నిర్బంధం

Apr 30 2015 1:24 PM | Updated on Sep 3 2017 1:10 AM

పంచాయతీరాజ్ శాఖ మంత్రి కేటీఆర్ కరీంనగర్ జిల్లా పర్యటన సందర్భంగా పలువురు కాంగ్రెస్ నాయకుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు.

కరీంనగర్: పంచాయతీరాజ్ శాఖ మంత్రి కేటీఆర్ కరీంనగర్ జిల్లా పర్యటన సందర్భంగా పలువురు కాంగ్రెస్ నాయకుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సంఘటన గురువారం ఉదయం చోటుచేసుకుంది.

గంభీరావుపేట మండలంలో మంత్రి పర్యటన సందర్భంగా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మృత్యుంజయను, ముస్తాబాద్‌లో గృహ నిర్బంధం చేశారు. కాంగ్రెస్ పార్టీ నాయకుల అరెస్ట్‌ను నిరసిస్తూ పలువురు కార్యకర్తలు మండల కేంద్రంలో రాస్తారాకో నిర్వహించారు.

Advertisement
 
Advertisement
Advertisement