మీరు అధికారులా.. లేక టీఆర్‌ఎస్‌ కార్యకర్తలా | congress leaders fires on govt officers | Sakshi
Sakshi News home page

మీరు అధికారులా.. లేక టీఆర్‌ఎస్‌ కార్యకర్తలా

May 1 2017 1:02 PM | Updated on Mar 18 2019 8:51 PM

మీరు అధికారులా.. లేక టీఆర్‌ఎస్‌ కార్యకర్తలా - Sakshi

మీరు అధికారులా.. లేక టీఆర్‌ఎస్‌ కార్యకర్తలా

నగరంలోని మార్కెట్‌ యార్డ్‌లో మరో సారి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి.

► అధికారులపై మండిపడ్డ కాంగ్రెస్‌ నాయకులు

ఖమ్మం: నగరంలోని మార్కెట్‌ యార్డ్‌లో మరో సారి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. సోమవారం మార్కెట్‌ను సందర్శించిన కాంగ్రెస్‌ సీఎల్పీ లీడర్‌ జానారెడ్డి, భట్టి విక్రమార్క, వీహెచ్‌లు మార్కెట్‌ కమిటీ చైర్మెన్‌తో మాట్లాడారు. అనంతరం అధికారులను నిలదీసిన నాయకులు మీరు అధికారులా.. లేక టీఆర్‌ఎస్‌ కార్యకర్తలా అని మండిపడ్డారు. దీంతో ఆగ్రహించిన టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు కాంగ్రెస్‌ కార్యకర్తలతో వాగ్వాదానికి దిగారు. ఇరు వర్గాల మధ్య తోపులాట జరగడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

అంతకు ముం‍దు జానారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. పత్తికి కనీసం రూ. 3 వేలు కూడా మద్దతు ధర కల్పించకపోవడం సర్కార్‌ వైఫల్యమే.. రైతు స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేస్తామని మాయమాటలు చెప్పిన ప్రభుత్వం రైతులను మోసం చేసిందని విమర్శించారు. తాము ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరడటం లేదని .. రైతులకు మద్దతు ధర కల్పించాలని కోరుతున్నామన్నాని తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement