'మా తప్పిదాల వల్లే ఎన్నికల్లో ఓటమి' | Congress leader admits defeat in telangana | Sakshi
Sakshi News home page

'మా తప్పిదాల వల్లే ఎన్నికల్లో ఓటమి'

May 30 2014 11:09 AM | Updated on Mar 18 2019 9:02 PM

'మా తప్పిదాల వల్లే ఎన్నికల్లో ఓటమి' - Sakshi

'మా తప్పిదాల వల్లే ఎన్నికల్లో ఓటమి'

సార్వత్రిక ఎన్నికల్లో తమ తప్పిదాల వల్లే కాంగ్రెస్ ఓటమి పాలయ్యామని కరీంనగర్ కాంగ్రెస్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ అన్నారు.

నల్లగొండ: సార్వత్రిక ఎన్నికల్లో తమ తప్పిదాల వల్లే కాంగ్రెస్ ఓటమి పాలయ్యామని కరీంనగర్ కాంగ్రెస్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ అన్నారు. ఆయన శుక్రవారమిక్కడ మాట్లాడుతూ ఎన్నికల ఫలితాలు ఎలా ఉన్నా... నల్గొండ జిల్లా ప్రజలు విజ్ఞత ప్రదర్శించి గుత్తా సుఖేందర్ రెడ్డిని, కాంగ్రెస్ ఎమ్మెల్యేలను గెలిపించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల ఆకాంక్షను గుర్తించి కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చారన్నారు. సోనియా లేకుంటే తెలంగాణ కల సాకారం అయ్యేది కాదని పొన్నం అన్నారు.

అయితే కొంతమంది అమర వీరుల త్యాగబలం, 14 ఏళ్ల కేసీఆర్ ఉద్యమం వల్లే తెలంగాణ వచ్చిందనటం సరికాదన్నారు. ఇవన్నీ అందులో భాగమేనని పొన్నం వ్యాఖ్యానించారు. ఇచ్చిన మాటకు కట్టుబడే కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వటం జరిగిందన్నారు. ఇక  పోలవరం ఆర్డినెన్స్ విషయంలో టీఆర్ఎస్ తీసుకొనే నిర్ణయానికి తమ మద్దతు ఉంటుందన్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement