తెలంగాణలో కాంగ్రెస్, సీపీఐల మధ్య దాదాపుగా పొత్తు ఖరారైంది. ఇరు పార్టీల మధ్య సీట్ల వ్యవహారం ఓ కొలిక్కి వచ్చినట్టు సమాచారం.
హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్, సీపీఐల మధ్య దాదాపుగా పొత్తు ఖరారైంది. ఇరు పార్టీల మధ్య సీట్ల వ్యవహారం ఓ కొలిక్కి వచ్చినట్టు సమాచారం. సీపీఐకి ఒక ఎంపీ సీటు, 9 ఎమ్మెల్యే సీట్లు ఇచ్చేందుకు కాంగ్రెస్ హైకమాండ్ అంగీకరించినట్టు తెలుస్తోంది. సీపీఐ నాయకుడు నారాయణ ఇటీవల టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యను కలసి చర్చించారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సీపీఐ మద్దతు ప్రకటించిన సంగతి తెలిసిందే. టీఆర్ఎస్ విలీనం, పొత్తు వ్యవహారం బెడిసికొట్టిన నేపథ్యంలో ఆ పార్టీకి చెక్ పెట్టేందుకు కాంగ్రెస్ పార్టీ సీపీఐతో జతకట్టేందుకు మొగ్గు చూపిస్తోంది. ఇదిలావుండగా ఖమ్మం లోక్సభ స్థానం నుంచి పోటీ చేయాలని ఆ జిల్లా సీపీఐ శాఖ నారాయణ పేరును ప్రతిపాదించింది.