'సోనియా వల్లే తెలంగాణ కల నెరవేరింది' | congress celebrate Telangana formation day in gandhi bhavan | Sakshi
Sakshi News home page

'సోనియా వల్లే తెలంగాణ కల నెరవేరింది'

Jun 2 2014 10:46 AM | Updated on Oct 22 2018 9:16 PM

'సోనియా వల్లే తెలంగాణ కల నెరవేరింది' - Sakshi

'సోనియా వల్లే తెలంగాణ కల నెరవేరింది'

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను కాంగ్రెస్ నిర్వహించింది. గాంధీభవన్ లో పొన్నాల జాతీయ జెండా ఎగురవేశారు.

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను కాంగ్రెస్ నిర్వహించింది. గాంధీభవన్లో తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య సోమవారం జాతీయ జెండా ఎగురవేశారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సోనియాగాంధీ ఇచ్చిన మాటకు కట్టుబడి తెలంగాణను ఇచ్చారని గుర్తు చేశారు. సోనియా గాంధీకి తెలంగాణ ప్రజలు రుణపడి ఉంటారన్నారు. సోనియా వల్లే తెలంగాణ కల నెరవేరిందన్నారు.  కాంగ్రెస్ హయాంలో పలు రంగాల్లో తెలంగాణ అభివృద్ధి చెందిందన్నారు. బంగారు తెలంగాణకు కాంగ్రెస్ కట్టుబడి ఉందని పొన్నాల స్పష్టం చేశారు.

తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని పొన్నాల ఆకాంక్షించారు. బంగారు తెలంగాణ నిర్మాణానికి అందరకూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా వ్యవసాయం మీద ఆధారపడ్డారని..ఈ రంగానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని పొన్నాల కోరారు. ఈ ఆవిర్భావ వేడుకల్లో దామోదర రాజనర్సింహ, అంజన్‌ కుమార్ యాదవ్, వీ హనుమంతరావుతో పాటు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, నేతలు పాల్గొన్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement