కేసీఆర్‌కు అభినందనల వెల్లువ | Congratulations flooding to kcr | Sakshi
Sakshi News home page

కేసీఆర్‌కు అభినందనల వెల్లువ

May 19 2014 2:19 AM | Updated on Sep 2 2017 7:31 AM

కేసీఆర్‌కు అభినందనల వెల్లువ

కేసీఆర్‌కు అభినందనల వెల్లువ

తెలంగాణ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి కాబోతున్న టీఆర్‌ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుకు వివిధ ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాల నేతలు, ఎమ్మెల్సీలు అభినందనలు తెలియజేశారు.

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి కాబోతున్న టీఆర్‌ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుకు వివిధ ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాల నేతలు, ఎమ్మెల్సీలు అభినందనలు తెలియజేశారు. పీఆర్‌టీయూ, టీఆర్‌టీయూ, తెలంగాణ గ్రూపు-1 అధికారుల సంఘాల నేతలు ఆదివారం కేసీఆర్‌ను కలిశారు. టీఆర్‌ఎస్ లెజిస్లేచర్ పార్టీ నేతగా ఎన్నికైన సందర్భంగా అభినందనలు తెలియ జేశారు.

తెలంగాణ పునర్నిర్మాణంలో భాగంగా రాష్ట్రాన్ని విద్యా పరంగా అభివృద్ధిలోకి తీసుకెళ్లడానికి తమ వంతు కృషి చేస్తామని పీఆర్‌టీయూ నేతలు పేర్కొన్నారు. అలాగే హరీష్‌రావుకు అభినందనలు తెలియజేశారు. కేసీఆర్‌ను కలిసిన వారిలో గ్రూపు-1 అధికారుల సంఘం అధ్యక్షుడు ఎం.చంద్రశేఖర్‌గౌడ్, ప్రధాన కార్యదర్శి హనుమంత్ నాయక్, పీఆర్‌టీయూ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పి.వెంకట్‌రెడ్డి, సరోత్తంరెడ్డి, ఎమ్మెల్సీలు పూల రవీందర్, మాజీ ఎమ్మెల్సీలు బి.మోహన్‌రెడ్డి, మధుసూదన్‌రెడ్డి తదితరులు ఉన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement