బస్సులను అడ్డుకుంటున్న వామపక్షాలు | communists protest the bus in hyderabad | Sakshi
Sakshi News home page

బస్సులను అడ్డుకుంటున్న వామపక్షాలు

Jul 17 2015 7:21 AM | Updated on Sep 4 2018 5:16 PM

బస్సులను అడ్డుకోవడానికి యత్నిస్తున్న వామపక్ష కార్యకర్తలను అడ్డు తొలగించడానికి పోలీసులు రంగంలోకి దిగారు.

హైదరాబాద్: బస్సులను అడ్డుకోవడానికి యత్నిస్తున్న వామపక్ష కార్యకర్తలను అడ్డు తొలగించడానికి పోలీసులు రంగంలోకి దిగారు. గురువారం తెల్లవారుజామున నుంచే జిల్లాలకు వెళ్లే ఆర్టీసీ బస్సులను వెళ్లనీయకుండా.. ఇమ్లీబన్ బస్టాండ్ ఎదుట కార్యకర్తలు ధర్నాకు దిగడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బస్టాండ్ ఎదుట నిరసనలు చేపడుతున్న పలువురు కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. మున్సిపల్ కార్మికుల న్యాయమైన డిమాండ్‌లని తీర్చాలని కోరుతూ.. వామపక్షాలు శుక్రవారం తెలంగాణ బంద్‌కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.

Advertisement
 
Advertisement
Advertisement