హోలీ వేడుకల్లో కలెక్టర్‌, కమిషనర్‌ | collector, commissioner celebrate the holi | Sakshi
Sakshi News home page

హోలీ వేడుకల్లో కలెక్టర్‌, కమిషనర్‌

Mar 12 2017 4:32 PM | Updated on Mar 21 2019 8:35 PM

హోలీ వేడుకలు కరీంనగర్‌లో కన్నుల పండుగలా జరిగాయి.

కరీంనగర్‌: హోలీ వేడుకలు కరీంనగర్‌లో కన్నుల పండుగలా జరిగాయి. స్త్రీ పురుష వయోభేదం లేకుండా రంగుల్లో మునిగితేలారు. పరస్పరం రంగులు చల్లుకుని హోలీ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. పోలీస్ హెడ్ క్వార్టర్‌లో సీపీ కమలాసన్ రెడ్డి పోలీస్ లతో కలిసి హోలీ వేడుకల్లో పాల్గొన్నారు.

కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో జరిగిన హోలీ వేడుకల్లో కలెక్టర్ సర్పరాజ్ అహ్మద్ తోపాటు జిల్లా అధికారులు పాల్గొన్నారు. అంబేడ్కర్ స్టేడియంలో జరిగిన హోలీ వేడుకల్లో ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మేయర్ రవీందర్ సింగ్ పాల్గొని రంగుల్లో మునిగి తేలారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement