రాష్టపతికి సీఎం రెండుసార్లు పాదాభివందనం | cm salute to president two times | Sakshi
Sakshi News home page

రాష్టపతికి సీఎం రెండుసార్లు పాదాభివందనం

Jul 5 2015 11:13 PM | Updated on Aug 14 2018 10:54 AM

రాష్టపతికి సీఎం రెండుసార్లు పాదాభివందనం - Sakshi

రాష్టపతికి సీఎం రెండుసార్లు పాదాభివందనం

యాదగిరి గుట్ట పర్యటన సందర్భంగా రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి సీఎం కేసీఆర్ రెండు సార్లు పాదాభివందనం చేశారు.

యాదగిరిగుట్ట (నల్లగొండ): యాదగిరి గుట్ట పర్యటన సందర్భంగా రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి సీఎం కేసీఆర్ రెండు సార్లు పాదాభివందనం చేశారు. రాష్ట్రపతి హెలికాప్టర్ దిగగానే ఆహ్వనం పలుకుతూ ఒకసారి పాదాభివందనం చేయగా... కొండపైన రాష్ట్రపతికి మెమొంటో ఇచ్చిన తర్వాత మరోసారి సీఎం పాదాభివందనం చేసి తన కృతజ్ఞతలు తెలియ జేశారు.
ఆర్ట్ డెరైక్టర్ పరిచయం..
స్వామి దర్శనానంతరం సీఎం కేసీఆర్ యాదగిరిగుట్టపై నూతన నిర్మాణాలకు డిజైన్ చేసిన ప్రముఖ ఆర్ట్ డెరైక్టర్ ఆనందసాయిని ప్రత్యేకంగా రాష్ట్రపతికి పరిచయం చేశారు. నూతన నిర్మాణాల గురించి రాష్ట్రపతికి వివరించాలని ఆనందసాయికి, దేవస్థానం ప్రధాన అర్చకులు లక్ష్మీనర్సింహాచార్యులుకు సూచించి వారికి ముందుకు పంపి, సీఎం తాను వెనక్కి జరగడం విశేషం.
 

Advertisement
 
Advertisement
Advertisement