పాలనకు కొత్త దిశ  | cm kcr speaks about new governance system in the assembly | Sakshi
Sakshi News home page

పాలనకు కొత్త దిశ 

Nov 18 2017 1:24 AM | Updated on Aug 15 2018 9:40 PM

cm kcr speaks about new governance system in the assembly - Sakshi - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రజల అవసరాల ప్రాతిపదికగా నిరంతరం పరిపాలన సంస్కరణలు జరగాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అన్నారు. ప్రజలకు పాలనను దగ్గర చేయడమే లక్ష్యంగా రాష్ట్రంలో భారీగా సంస్కరణ లు చేస్తున్నామని చెప్పారు. జిల్లాలు, రెవెన్యూ డివి జన్లు, మండలాలు, పోలీస్‌ డివిజన్లు, పోలీస్‌ స్టేషన్ల ఏర్పాటు విషయంలో 90% మంది ప్రజలు సంతో షంగా ఉన్నారన్నారు. కొత్తగా 5 వేల గ్రామ పంచా యతీలు, 15 నుంచి 20 కొత్త మున్సిపాలిటీలు ఏర్పా టు చేస్తామన్నారు. గ్రామస్థాయిలో ఉత్తమ పరిపాల న వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు కొత్త చట్టాన్ని రూపొందిస్తున్నామన్నారు. ‘‘అధికారుల బృందం దక్షిణాఫ్రికా వెళ్లి అధ్యయనం చేస్తుంది. వచ్చే నెలలో అసెంబ్లీలో కొత్త చట్టం తెచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. భూరికార్డుల ప్రక్షాళన పూర్తయ్యాక రెవెన్యూ గ్రామాల పునర్విభజన చేపడతాం’’ అని తెలిపారు. ‘పరిపాలన సంస్కరణలు, నూతన పాలన వ్యవస్థ’ అంశంపై శుక్రవారం అసెంబ్లీలో లఘు చర్చ జరిగింది. ఈ సందర్భంగా వివిధ పార్టీల ఎమ్మెల్యేల సందేహాలకు సీఎం సమాధానమిచ్చారు. కొత్త రాష్ట్రమైనా తెలంగాణలో జరిగినట్లుగా దేశంలోని ఏ రాష్ట్రంలోనూ ఇంతగా సంస్కరణలు జరగలేదని చెప్పారు. సీఎం ఏమన్నారో ఆయన మాటల్లోనే..

ఉన్నంతలో మంచిగా చేశాం..
పశ్చిమబెంగాల్, అవశేష ఆంధ్రప్రదేశ్‌లో తప్ప దేశం లో అన్ని రాష్ట్రాల్లోనూ జిల్లాల పునర్విభజన జరి గింది. జిల్లాల పునర్విభజన జరగకపోవడం వల్ల ఈ రెండు రాష్ట్రాలు నష్టపోయాయి. రాష్ట్ర ప్రజల శ్రేయస్సు, పరిపాలన సౌలభ్యం కోసం జిల్లాల పునర్విభజన చేశాం. 31 జిల్లాల్లోని అధికారులు, సిబ్బంది ఉత్సాహంగా పనిచేస్తున్నారు. ప్రజలు సంతోషంగా ఉన్నారు. ఉన్నంతలో మంచిగా చేశాం. నారాయణపేట జిల్లా కావాలని డిమాండ్‌ చేశారు. సంస్కరణలు నిరంతర ప్రక్రియ. ఎప్పటి అవసరాలను బట్టి అప్పుడు సంస్కరణలు జరుగు తుంటాయి. అవసరమైతే జిల్లాలు, డివిజన్లు, మండలాలు ఏర్పాటు చేసుకుంటాం. పరకాలను రెవెన్యూ డివిజన్‌గా చేయబోతున్నాం. దేనికైనా రెండుమూడు నెలల సమయం పడుతుంది. 2024 నాటికి రాష్ట్ర బడ్జెట్‌ రూ.5 లక్షల కోట్లకు చేరు తుంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గుర్తించి ఇండియా టుడే తాజాగా రెండు అవార్డులు ఇచ్చింది. ఆర్థికం గా బాగున్న రాష్ట్రంలో పేదలు ఉండటానికి అవకా శం లేదు. రాష్ట్రంలో ప్రస్తుతం 10,750 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. కొత్తగా 5 వేల గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేస్తాం. అలాగే 15 నుంచి 20 వరకు కొత్త మున్సిపాలిటీలను ఏర్పా టు చేస్తాం. అన్ని పార్టీల ఎమ్మెల్యేలు అనుభవంతో మంచి సూచనలు చేయాలి.

జిల్లాల ఏర్పాటు రాష్ట్రాల నిర్ణయం
ప్రజల అభీష్టం.. ప్రజాప్రతినిధుల విజ్ఞప్తుల మేర కు పరిపాలన మెరుగుపరిచేందుకు జిల్లాల పునర్వి భజన చేపట్టాం. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల కు ప్రత్యేక గుర్తింపు ఉంది. హైదరాబాద్‌కున్న ప్రత్యేక గరిమను దెబ్బతీయవద్దని, దాన్ని విభజిం చవద్దని అన్ని రాజకీయ పార్టీలు సూచించాయి. కాంగ్రెస్‌కు హైదరాబాద్‌లో ప్రాతినిధ్యం లేకపో వడం వల్ల వారు సమావేశాలకు రాలేదు. అందుకే పునర్విభజనలో హైదరాబాద్‌ విషయం ఆ పార్టీ సభ్యులు తెలియలేదు. కాంగ్రెస్‌ సభ్యులకు సీఎల్పీ అవగాహన కల్పించాలి. జిల్లాల పునర్విభజనపై కేంద్రం గెజిట్‌ ఇవ్వాలనేది పూర్తిగా అసంబద్ధం. ఈ ప్రక్రియ పూర్తిగా రాష్ట్రాల నిర్ణయం. ఎన్‌ఐసీ, ఆర్బీఐ ఇప్పటికే నోటిఫికేషన్లు జారీ చేశాయి. ఆర్బీఐ లీడ్‌ బ్యాంకులను నియమించింది. కొత్త జిల్లాల ఏర్పాటుపై కేంద్రంలోని అన్ని శాఖలకు సమాచారం పంపించాం. ప్రత్యేకంగా కేంద్రం నోటిఫికేషన్‌ అవసరం లేదని కేంద్ర హోంశాఖ స్పష్టం చేసింది. కేంద్రం నుంచి కొత్త జిల్లాల వారీగానే మంజూర్లు వస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వ వెబ్‌సైట్‌లోనూ తెలంగాణలో 31 జిల్లాలు ఉన్నట్లు పేర్కొన్నారు. జిల్లాల పునర్విభజన ముసాయిదా లో ఉన్నట్లుగా లేదని కాంగ్రెస్‌ సభ్యుడు సంపత్‌ కుమార్‌ అన్నారు. నిజమే ముసాయిదాపై అభి ప్రాయం సేకరించి తుది నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. కొత్త జిల్లాల్లో ఉద్యోగులకు సమస్య లున్న మాట వాస్తవమే. 8, 10 నెలల్లో అన్నింటినీ అధిగమిస్తాం. క్యాడర్‌ అనుమతి కోసం కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశాం. కేంద్ర సర్వీసు అధికారులు అలాట్‌ అవుతారు. కింది స్థాయి సిబ్బం దిని నియ మిస్తు న్నాం. 2019 ఎన్నిక ల్లోపు అంతా చక్కబడు తుంది. ఏ జిల్లా ఆ జిల్లా స్వతంత్రంగా ఎన్నికలు నిర్వహించేలా అవుతుంది. 1300 కోట్లతో జిల్లాల్లో అవసరమైన నిర్మాణాలను చేపడుతున్నాం.

నియోజకవర్గాల పునర్విభజన చేయాల్సిందే
అసెంబ్లీ, లోక్‌సభ నియోజకవర్గాలు ఒకే జిల్లా పరి ధిలో ఉండాలని ఎక్కడా లేదు. నియోజకవర్గాల పునర్విభజన పూర్తిగా కేంద్ర ప్రభుత్వం, ఎన్నికల కమిషన్‌ పరిధిలోని అంశం. ప్రస్తుతం 16 రాష్ట్రాల్లో నియోజకవర్గాలు ఒకటి కంటే ఎక్కువ జిల్లాల్లో ఉన్నాయి. గతంలో భద్రాచలం లోక్‌సభ నియోజక వర్గం 5 జిల్లాల్లో ఉండేది. నా నియోజకవర్గం గజ్వేలు సైతం రెండు జిల్లాల్లో ఉంది. ప్రజల శ్రేయస్సు ప్రాతిపదికనే పాలనలో మార్పులు జరగాలి. అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన చేయాలని విభజన చట్టంలోనే ఉంది. అయినా కేంద్రం చేయడం లేదు. దీనిపై కేంద్రాన్ని మళ్లీ అసెంబ్లీ నుంచి కోరుతున్నాం. లోక్‌సభ నియోజకవర్గాల సంఖ్య పెరగాలి. ఎప్పుడో 30 కోట్ల జనాభా ఉన్నప్పుడు ఉన్న సంఖ్యే ఇప్పుడు 130 కోట్ల జనాభా ఉన్నప్పుడు ఉంటే ఎలా?

ప్రధాని మోదీ మెచ్చుకున్నారు
కేంద్రం, అన్ని రాష్ట్రాలు కలిపి 44 లక్షల కోట్ల బడ్జెట్‌ ఉంటోంది. ఎంత ఖర్చు చేసినా స్థానిక సంస్థలు ఎక్కడికక్కడ పని చేయకపోతే ఏమీ జరగదు. హైదరాబాద్‌లో ఉన్న సీఎం ఏమని చేస్తడు. అధికారాలు, విధులు బదిలీ జరగాలి. ఇదే విషయం చెబితే ప్రధాని మోదీ నన్ను మెచ్చుకు న్నారు. కొత్త జిల్లాల ఏర్పాటుతో జెడ్పీ చైర్మన్లు ఉత్సవ విగ్రహాలుగా మారారని బీజేపీ సభ్యుడు కిషన్‌రెడ్డి అన్నారు. ఇలా జరగడానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వమే కారణం. ఆర్థిక సంఘం నిధులు, ఉపాధి హామీ పథకాన్ని నేరుగా గ్రామ పంచాయతీలకు ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. దీని వల్లే జెడ్పీలకు నిధులు లేకుండా పోయాయి. రాష్ట్ర ప్రభుత్వం తరఫున పంచాయతీలకు నిధులిచ్చేందుకు కొత్త చట్టం తెస్తున్నాం. మెరుగైన స్థానిక పరిపాలనకు ఇది ఉపయోగపడుతుంది.

జోన్‌ల పునర్విభజన జరగాలి
జోన్‌ల పునర్విభజన జరగాలి. తెలంగాణకు అనుగుణంగా మార్చుకోవాలి. ముల్కీ నిబంధనలు వద్దని ఆంధ్రాప్రాంతం వారు, కావాలని తెలంగాణ వారు అప్పుడు డిమాండ్‌ చేశారు. సుప్రీంకోర్టు తీర్పుతో వచ్చాయి. ఇదే విషయంపై ఆంధ్ర వాళ్ల పీడ మనకు విరగడ అయ్యిందని అప్పటి సీఎం పీవీ నర్సింహారావు ఇదే అసెంబ్లీలో చెప్పారు. ఈ మాటలను పట్టుకుని ఆంధ్రావారు ఢిల్లీలో లాబీయింగ్‌ చేసి సుప్రీంకోర్టు తీర్పును పక్కనబెట్టి అప్పుడు రాజ్యాంగ సవరణ చేశారు. రాష్ట్రపతి ఉత్తర్వులు సింగరేణి వంటి సంస్థలకు వర్తించవని తిరకాసు పెట్టారు. అసెంబ్లీ, సచివాలయం రాష్ట్రపతి ఉత్తర్వులో లేవని అందరు వాళ్లే ఉంటే ఎలా అని ఇదే అసెంబ్లీలో నేను మాట్లాడాను. అందుకే తెలంగాణకు అనుగుణంగా పరిపాలన మార్పులు జరగాలి. జోన్లపై చర్చ పెడదాం. అందరి ఆమోదంతో నిర్ణయం తీసుకుందాం. 

ప్రజల వద్దకు పాలన
రాష్ట్ర ప్రభుత్వం జిల్లాల పునర్విభజన చేయడంతో ప్రజలకు పాలన దగ్గరైంది. సంక్షేమ పథకాల అమలు తీరు మెరుగుపడింది. కింది స్థాయిలో సిబ్బంది ఖాళీలను భర్తీ చేస్తే ఇంకా మంచి ఫలితాలు ఉంటాయి. ప్రతి మండలంలో ప్రభుత్వ ఆస్పత్రిని నిర్మించాలి.  – జాఫర్‌ హుస్సేన్, ఎంఐఎం

ప్రజలకు ఉపయోగపడాలి 
జిల్లా కేంద్రాల్లో ప్రభుత్వం నిర్మిస్తున్న కార్యాలయాల స్థలాల ఎంపిక సరిగా లేదు. ప్రజలకు దగ్గరగా ఉన్న కార్యాలయాలను పక్కనబెట్టి దూరంగా ఉన్న వాటిని ఎంపిక చేస్తున్నారు. ఖమ్మం, మహబూబ్‌నగర్‌ ఈ సమస్య ఉంది.  – సండ్ర వెంకటవీరయ్య, టీడీపీ

ఐటీడీఏలు బాగా లేవు
జిల్లాల పునర్విభజన శాస్త్రీయంగా జరగలేదు. జనాభా, విస్తీర్ణం ఏదీ శాస్త్రీయంగా లేదు. ఐటీడీఏలకు అధికారులు లేకుండా అయ్యారు. భద్రాచలం, ఉట్నూరు ఐటీడీఏలకు ఐఏఎస్‌లను పీవోలుగా నియమించాలి.
 – సున్నం రాజయ్య, సీపీఎం

ప్రతిపక్షాలను బలహీనపరిచేందుకే..
జిల్లాల పునర్విభజన శాస్త్రీయంగా జరగలేదు. ప్రతిపక్ష పార్టీలను బలహీనం చేయడం లక్ష్యంగా చేసినట్లుగా ఉంది. ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేలకు పట్టున్న నియోజక వర్గాలను రెండుమూడు జిల్లాల్లో కలిపారు. సీఎం కేసీఆర్‌కు ఆరో నంబర్‌పై నమ్మకమని బయట చెప్పుకుంటున్నారు. ముసాయిదాలో జిల్లాల సంఖ్య 24 ఉంటే తర్వాత 31కి పెంచా రు. జిల్లాల పునర్విభజనతో అధికారులకు ప్రజ లకు దగ్గరయ్యారు. అయితే అధికారులకు పెద్దగా పని లేక ఇతర అంశాలపై దృష్టిపెడు తు న్నారు. అధికార పార్టీ వాళ్లు చేస్తే ఏమీ అనడం లేదు. మిగిలిన పార్టీల వారు అయితే ఇంకో తీరుగా వ్యవహరిస్తున్నారు. జనాభా, విస్తీర్ణం పరంగా ఎలా చూసినా హైదరాబాద్‌ పునర్వి భజన చేయాల్సి ఉంది. ఎంఐఎం కోసమే హైదరాబాద్‌ను ముట్టుకోలేదనే అభిప్రాయం ఉంది. కల్వకుర్తిని రెవెన్యూ డివిజన్‌ చేయాలని ప్రజలు ఎంత డిమాండ్‌ చేసినా పట్టించుకోలేదు. రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటు సరిగా జరగలేదు.    -ఎస్‌.సంపత్‌కుమార్, కాంగ్రెస్‌

ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నారు..
జిల్లాల పునర్విభజన సరిగా జరగలేదు. ప్రజల సౌకర్యాన్ని పట్టించుకోలేదు. వర్క్‌ టు ఆర్డర్‌తో ఉద్యోగులు కొత్త జిల్లాల్లో పని చేస్తున్నారు. కిందిస్థాయి ఉద్యో గులు, కానిస్టేబుళ్లు, హోం గార్డులు నివాసాలకు దూరం గా పనిచేస్తూ ఇబ్బంది పడు తున్నారు. ప్రభుత్వం సాధా రణ బదిలీల ప్రక్రియను పూర్తి చేయాలి. జిల్లాల పునర్విభజనతో జిల్లా పరిషత్‌లు నిర్వీర్యమయ్యాయి. -జి.కిషన్‌రెడ్డి, బీజేఎల్పీ నేత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement