స్టాలిన్‌కు కేసీఆర్‌ కృతజ్ఞతలు | cm kcr say thanks to mk stalin | Sakshi
Sakshi News home page

స్టాలిన్‌కు కేసీఆర్‌ కృతజ్ఞతలు

Nov 27 2017 12:24 PM | Updated on Aug 15 2018 8:12 PM

 cm kcr say thanks to mk stalin - Sakshi - Sakshi - Sakshi - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సామాజిక న్యాయం సాధించే విషయంలో రాష్ట్రాల అధికారం కోసం తాము చేస్తున్న ప్రయత్నాలను స్వాగతించిన డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడు ఎం.కె.స్టాలిన్‌కు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు కృతజ్ఞతలు తెలిపారు. సీఎం కేసీఆర్‌ సోమవారం ఉదయం స్టాలిన్‌తో ఫోన్‌లో మాట్లాడారు. ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలకు రిజర్వేషన్లు పెంచడం ద్వారా సామాజిక న్యాయం సాధించడానికి రాష్ట్రాలకు అధికారం అప్పగించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇటీవల అసెంబ్లీలో కేంద్రాన్ని కోరారు.

దీనిపై హర్షం వ్యక్తంచేస్తూ స్టాలిన్‌ ఆదివారం చెన్నైలో ప్రకటన విడుదల చేశారు. సామాజిక న్యాయం సాధించడానికి.. బడుగు వర్గాలకు రిజర్వేషన్లు పెంచాలనే విషయంలో డీఎంకే మొదటినుంచీ అవిశ్రాంత పోరాటం చేస్తున్నదని, దీని ఫలితంగానే తమిళనాడులో 69 శాతం రిజర్వేషన్లు సాధ్యమయ్యాయని స్టాలిన్‌ ఆ ప్రకటనలో పేర్కొన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌ కూ డా రాష్ట్రంలో రిజర్వేషన్లు పెంచడానికి చేస్తున్న ప్రయత్నాలకు, ఈ విషయంలో రాష్ట్రాలకే అధికారం అప్పగించాలనే డిమాండ్‌కు స్టాలిన్‌ మద్దతు ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే స్టాలిన్‌తో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఫోన్‌ చేసి మాట్లాడారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement