ఒక్కరూ లేకపోయినా రిజర్వేషన్‌! | Telangana Government Reservations in Panchayat Elections | Sakshi
Sakshi News home page

ఒక్కరూ లేకపోయినా రిజర్వేషన్‌!

Nov 25 2025 7:52 AM | Updated on Nov 25 2025 7:52 AM

Telangana Government Reservations in Panchayat Elections

సాక్షి,హైదరాబాద్‌: రాష్ట్రంలోని పంచాయతీలకు రిజర్వేషన్లు ఖరారయ్యాయి. అయితే, చాలాచోట్ల రిజర్వేషన్లు చిత్రవిచిత్రంగా ఉన్నాయి. నల్లగొండ జిల్లాలోని మూడు గ్రామాల్లో ఎస్టీ కేటగిరీలో ఒక్క అభ్యర్థి లేకపోయినా.. ఆ గ్రామాల సర్పంచి పదవులు ఎస్టీకి రిజర్వు అయ్యాయి. దీంతో అక్కడ ఎవరూ పోటీ చేయలేని పరిస్థితి. మాడుగులపల్లి మండలం అభంగాపురం గ్రామంలో ఎస్టీలు ఒక్కరూ లేకపోయినా, ఆ స్థానం ఎస్టీ జనరల్‌కు రిజర్వు అయింది. అదేవిధంగా అనుముల మండలం పేరూరు ఎస్టీ మహిâళకు రిజర్వు అయింది. అక్కడ ఎస్టీ మహిళ ఒక్కరూ లేకపోగా, ఒకే ఒక్క ఎస్టీ పురుషుడు ఉన్నారు. 

తిరుమలగిరి(సాగర్‌) మండలంలోని చింతలపాలెం గ్రామ పంచాయతీ ఎస్టీ మహిళకు రిజర్వు అయింది. అక్కడ ఎస్టీ మహిళ  ఒక్కరూ లేరు. మాడుగులపల్లి మండలంలోని ఇందుగుల గ్రామం ఎస్టీ మహిళకు రిజర్వు అయింది. అక్కడ ఎస్టీ ఓట్లు రెండే ఉన్నాయి. దీంతో అక్కడ సర్పంచ్‌గా ఎస్టీ మహిళ ఏకగ్రీవం కానున్నారు. గజాలాపురం కూడా ఎస్టీ జనరల్‌కు రిజర్వు కాగా, అక్కడ ఎస్టీ మహిళ ఒక్కరే ఉన్నారు. అడవిదేవులపల్లి మండలం ముదిమాణిక్యం ఎస్టీ జనరల్‌కు రిజర్వు అయింది. అక్కడ 11 మందే ఎస్టీలు ఉన్నారు.   

వారికి ఒక్క గ్రామం రాలేదు 
నల్లగొండ జిల్లాలోని పలు మండలాల్లో జనాభా పరంగా ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఉన్నా ఒక్క గ్రామం కూడా రిజర్వు కాలేదు. అందులో అడవిదేవులపల్లి మండలంలో 13 గ్రామ పంచాయతీలు ఉండగా, వాటిల్లో ఎస్సీ, బీసీల జనాభా ఎక్కువగానే ఉన్నా అక్కడ ఒక్క గ్రామం కూడా ఎస్సీలకు, బీసీలకు రిజర్వు కాలేదు. సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలంలోని 22 గ్రామ పంచాయతీల్లో ఒక్కటీ బీసీలకు దక్కలేదు. చండూరు మండలంలో ఎస్టీలు ఉన్నా.. 19 గ్రామ పంచాయతీల్లో ఒక్కటీ వారికి దక్కలేదు.  

17 గ్రామాలున్నా.. బీసీలకు సున్నా 
రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలంలో 17 గ్రామాలు ఉండగా.. ఇందులో వంద శాతం గిరిజన జనాభా ఉన్న ఆరు గ్రామాలను ఎస్టీలకు కేటాయించారు. మిగిలిన 11 గ్రామాల్లో మళ్లీ ఎస్టీలకు రెండు, ఎస్సీలకు మూడు, మిగతా ఆరు గ్రామాలకు జనరల్‌ కేటగిరీలో రిజర్వేషన్‌ కలి్పంచారు. కానీ, బీసీలకు ఒక్క సీటు కూడా కేటాయించలేదు. బీసీ జనాభా ఎక్కువగా ఉన్న గ్రామాలకు చెందిన ప్రజాప్రతినిధులు, స్థానికులు రిజర్వేషన్లపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఇన్‌చార్జి కలెక్టర్‌ గరిమా అగ్రవాల్‌ను సోమవారం కలిశారు. కాగా, రాజన్నసిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంటలో సర్పంచ్‌ స్థానానికి పోటీ చేయాలనుకుంటున్న ఇద్దరు సోమవారం తమ ప్రచారం మొదలుపెట్టారు.  

మల్లమ్మ.. జాక్‌పాట్‌..
వరంగల్‌ జిల్లా సంగెం మండలంలోని ఆశాలపల్లిలో ఎస్సీ జనాభా లేకపోగా 2011లో జనాభా లెక్కల్లో జరిగిన తప్పిదంతో ప్రస్తుతం ఎస్సీ మహిళకు సర్పంచ్‌ రిజర్వేషన్‌ కేటాయించారు. ఇటీవల బతుకుదెరువు కోసం వచ్చిన ఎస్సీ మహిళ ఒక్కరే ఉండడంతో ఆమె జాక్‌పాట్‌ సర్పంచ్‌ కానున్నది. నాలుగేళ్ల క్రితం వర్ధన్నపేట మండలం రామారం నుంచి కొంగర మల్లమ్మ, వెంకటయ్య దంపతులు బతుకుదెరువు కోసం పాలేరు పనికి ఆశాలపల్లి గ్రామానికి వచ్చి ఉన్నారు. వారికి ముగ్గురు కూతుళ్లు ఉండగా పెళ్లి చేసి ఇతర గ్రామాలకు పంపించారు. నాలుగు నెలల క్రితం వెంకటయ్య గేదెలను మేపడానికి వెళ్లి కుంటలో పడి చనిపోయాడు. ఇప్పుడు మల్లమ్మ ఒక్కరే ఎస్సీ ఓటరుగా నమోదై ఉంది.  

∙మరోవైపు, వంజరపల్లి పంచాయతీ పరిధిలో గతంలో రేఖియానాయక్‌ తండా ఉండేది. 2018లో తండాలను, శివారు గ్రామాలను నూతన పంచాయతీలుగా చేసిన సమయంలో వంజరపల్లి పరిధిలోని రేఖియానాయక్‌ తండాను పోచమ్మతండా పంచాయతీలో వీలినం చేశారు. దీంతో వంజరపల్లిలో ఎస్టీలు ఒకరూ కూడలేరు. కానీ, గ్రామంలోని రెండు వార్డులు ఎస్టీలకు కేటాయించడంతో ఎస్టీలు లేక ఆ వార్డులు ఖాళీగా ఉన్నాయి.  

సర్పంచులు లేని గ్రామాలు.. 
నాగర్‌కర్నూల్‌ జిల్లాలోని నల్లమల అటవీప్రాంతంలోని ఏజెన్సీ ఏరియాలోని 50 గ్రామాలు ఎస్టీ రిజర్వ్‌ అయ్యాయి. వీటిలో అమ్రాబాద్‌ మండలంలోని ఐదు గ్రామాల్లో మాత్రం ఒక్కరు కూడా ఎస్టీలు లేరు. జిల్లాలోని అమ్రాబాద్‌ మండలంలోని కల్ములోనిపల్లి, కుమ్మరోనిపల్లి, వంగురోనిపల్లి, ప్రశాంత్‌నగ ర్‌కాలనీ, లక్ష్మాపురం గ్రామాలు గత పంచాయతీ ఎన్నికల్లోనూ ఎస్టీలకు రిజర్వ్‌ అయ్యాయి. అయితే ఈ గ్రామాల్లో ఎస్టీ కుటుంబాలే లేకపోవడంతో సర్పంచులుగా ఎవరూ పోటీచేయలేకపోయారు. ఈ ఐదు గ్రామాలకు సర్పంచులు లేకుండానే ఐదేళ్ల పదవీకాలం గడిచిపోయింది. ఈసారి కూడా ఈ గ్రామాలు ఎస్టీ రిజర్వ్‌ కావడంతో సర్పంచులు లేకుండానే కొనసాగనున్నాయి.  

జనాభా ఎస్సీ.. రిజర్వేషన్‌ జనరల్‌ 
జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం మల్లంపల్లి, అయ్యవారిగూడెం రెండు గ్రామాల్లో ఎస్సీ సా మాజిక వర్గం ఉంది. కానీ, రెండు గ్రామాలు జనర ల్‌ రిజర్వేషన్లు కావడం, ఇతర వర్గాలు లేకపోవడంతో ఎస్సీ వర్గానికి చెందిన వారే జనరల్‌ స్థానాల్లో సర్పంచ్‌ అభ్యర్థులుగా పోటీ చేయనున్నారు. 

ఎస్టీ ఓటర్లే లేరు.. 
మెదక్‌ జిల్లా మనోహరాబాద్‌ మండలంలోని చెట్లగౌరారం పంచాయతీలో 8 వార్డులకు గాను 4 వార్డులు ఎస్టీ జనరల్, 5 వార్డులు ఎస్టీ మహిళలకు కేటాయించారు. కాగా గ్రామంలో ఎస్టీ ఓ టర్లే లేరు. గతంలో కూడా రెండు వార్డులు ఎస్టీలకు కేటాయించగా, అభ్యర్థులు ఎవరూ లేకపోవడంతో వాటికి ఎన్నికలు నిర్వహించలేదు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement