ఆరోగ్యపథం.. సంక్షేమ రథం

CM KCR Holds Meeting With District Collectors Today - Sakshi

నేడు కలెక్టర్లతో సీఎం కీలక సమావేశం

10 అంశాలపై కలెక్టర్లకు దిశానిర్దేశం చేయనున్న కేసీఆర్‌

కరోనా కట్టడితోపాటే అభివృద్ధి, సంక్షేమంపై ప్రభుత్వం దృష్టి

భూముల ప్రక్షాళన, నియంత్రిత పంటల సాగే ప్రధాన ఎజెండా

వ్యవసాయేతర భూముల లెక్క తేల్చే దిశగా కీలక నిర్ణయం?

వర్షాకాలం.. అంటువ్యాధుల నివారణపై ప్రత్యేక కార్యాచరణ

సాక్షి, హైదరాబాద్‌: మూడు నెలలుగా కరోనా వ్యాధి నియంత్రణపై ప్రత్యేక దృష్టిసారించి పనిచేసిన ప్రభుత్వ యంత్రాంగం ఇక అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు వైపు మళ్లనుంది. వైరస్‌ కట్టడికి మరింత పకడ్బందీ చర్యలు తీసుకుంటూనే, ప్రగతి కార్యక్రమాలను పరుగులు పెట్టించనుంది. ఈ మేరకు గురువారం హైదరాబాద్‌లో జరగనున్న కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో సీఎం కేసీఆర్‌ అధికార యంత్రాంగానికి దిశానిర్దేశం చేయనున్నారు. కరోనా వైరస్‌ నియంత్రణతోపాటు ప్రభుత్వం చేపట్టాల్సిన పలు కార్యక్రమాల అమలుపై ఆయన కలెక్టర్లకు సూచనలు చేసే దిశగా సమావేశపు ఎజెండాను ఖరారు చేశారు. (ప్రొఫెసర్‌ ఖాసీం విడుదల)

ఈ సమావేశంలో నియంత్రిత వ్యవసాయంతో పాటు భూముల ప్రక్షాళన, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్ల ఏర్పాటు, భూసేకరణ, రుణమాఫీ, ఉపాధి హామీ పనులు, పట్టణ ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పన, రానున్న వర్షాకాలంలో అంటువ్యాధులు ప్రబలకుండా తీసుకోవాల్సిన చర్యలు తదితర పది అంశాలపై మంత్రులు, కలెక్టర్లు, ఉన్నతాధికారులతో జరిగే విస్తృతస్థాయి సమావేశంలో చర్చించనున్నారు.

సేద్యం..రైతులు..భూములు
కలెక్టర్లతో నేడు జరిగే సమావేశంలో నియంత్రిత వ్యవసాయం, భూముల ప్రక్షాళన, రైతు రుణమాఫీ అంశాలపై సీఎం కేసీఆర్‌ ప్రత్యేకంగా మాట్లాడనున్నారు. రాష్ట్రంలో ఏ పంట ఎంత సాగు చేయాలి?, ఏ ప్రాంతంలో ఎలాంటి పంటల సాగుకు రైతులు అలవాటుపడ్డారు?, ఒకవేళ ఆ ప్రాంతంలో పంటమార్పిడి చేయాలనుకుంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలి, రైతులకు ఆ దిశగా కౌన్సెలింగ్‌ ఎలా చేయాలనే విషయాలపై కేసీఆర్‌ కలెక్టర్లకు దిశానిర్దేశం చేస్తారని ప్రభుత్వవర్గాలు చెబుతున్నాయి. ఇందులో భాగంగా నేటి సమావేశానికి వ్యవసాయ శాఖ, జిల్లా రైతుసమన్వయ కమిటీ అధ్యక్షులను కూడా ఆహ్వానించారు.

భూముల ప్రక్షాళన అంశంపై కేసీఆర్‌ ఈ సమావేశంలో ప్రత్యేక దృష్టి సారించనున్నారు. ముఖ్యంగా సాగునీటి ప్రాజెక్టుల కోసం సేకరించిన భూములపై హక్కుల మార్పిడి, ప్రభుత్వ భూముల ఆక్రమణలు, వ్యవసాయ భూములుగా పేర్కొంటూ వ్యవసాయేతర అవసరాలకు వినియోగిస్తున్న భూముల లెక్కలు తేల్చనున్నారు. అలాగే ఇంకా రాష్ట్రంలో జరగాల్సిన భూసేకరణ, ప్రజలకు కనీస అవసరాల కల్పనలో (పట్టణ ప్రాంతాల్లో) భూముల లభ్యత, ఆహారశుద్ధి పరిశ్రమలు, వ్యవసాయ గిడ్డంగులు, ఆగ్రి కాంప్లెక్సుల నిర్మాణానికి భూముల లభ్యతపై కలెక్టర్ల నుంచి వివరాలు సేకరించనున్నారు.

తద్వారా రైతు సంబంధ పరిశ్రమల అభివృద్ధికి బాటలు వేసేలా ఏ జిల్లాలో ఎలాంటి పరిశ్రమలు ఏర్పాటుచేయాలనే దానిపై కూడా కలెక్టర్లకు మార్గదర్శనం చేయనున్నారని తెలుస్తోంది. ప్రధాన ఎన్నికల హామీ అయిన రైతు రుణమాఫీపై కలెక్టర్ల నుంచి ఫీడ్‌బ్యాక్‌ తీసుకోనున్నారు. ఈ మేరకు ఆయా జిల్లాల కలెక్టర్లు స్థానిక బ్యాంకర్లతో సమావేశమై ఏ మేరకు మాఫీ జరిగిందన్న వివరాలు తీసుకురావాలని కలెక్టర్లకు సమాచారమందింది. ఇంకా ఉపాధిహామీ పథకం అమలు, పనిదినాల కల్పన, జాబ్‌కార్డుల జారీ, పల్లె ప్రగతి అమలుపైనా సీఎం కలెక్టర్లతో చర్చించే వీలుంది.

సమావేశ ముఖ్యాంశాలు

 • రైతులకు రుణమాఫీ
 • కరోనా నియంత్రణ చర్యలు 
 • ఫుడ్‌ ప్రాసెసింగ్‌ జోన్లు, అగ్రి కాంప్లెక్సులు, గోదాముల నిర్మాణానికి భూముల లభ్యత
 • ప్రభుత్వ అవసరాలకు సేకరించిన భూములను సమగ్ర భూరికార్డుల నిర్వహణ విధానం (ఐఎల్‌ఆర్‌ఎంఎస్‌)తో సరిపోల్చే అంశం
 • ఐఎల్‌ఆర్‌ఎంఎస్‌లో
 • అన్ని ప్రభుత్వ ఆస్తుల మార్కింగ్‌
 • పంచాయతీల్లో లేఅవుట్లు,
 • ప్లాట్ల రిజిస్ట్రేషన్ల విశ్లేషణ ద్వారా
 • వ్యవసాయేతర అవసరాలకు
 • వినియోగిస్తున్న భూముల గుర్తింపు, వాటిని ఐఎల్‌ఆర్‌ఎంఎస్‌లో నవీకరణ
 • భూసేకరణ తప్పనిసరి అయిన
 • ప్రాజెక్టులు, ఇతర ప్రభుత్వ
 • కార్యక్రమాల అమలు తీరు
 • పట్టణాల్లో ప్రజావసరాలకు
 • భూముల లభ్యత
 • ఉపాధి హామీ అమలు, జాబ్‌ కార్డులు, ఉపాధి పనుల కల్పన, పల్లె ప్రగతి
 • వర్షాకాలంలో
 • పట్టణాలు, గ్రామ పంచాయతీల్లో
 • తీసుకోవాల్సిన చర్యలు
Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

మరిన్ని వార్తలు

10-07-2020
Jul 10, 2020, 03:24 IST
సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో కరోనా తీవ్రరూపం దాలుస్తోంది. ప్రతిరోజూ వైరస్‌ బారిన పడుతున్న వారి సంఖ్య భారీగా పెరుగుతోంది. తెలంగాణలో...
10-07-2020
Jul 10, 2020, 02:15 IST
సాక్షి, న్యూఢిల్లీ:  దేశంలో కరోనా మహమ్మారి ఉధృతి రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. బుధవారం నుంచి గురువారం వరకు ఒక్క రోజులో...
10-07-2020
Jul 10, 2020, 01:01 IST
ప్రముఖ నిర్మాత, నటుడు ‘రాక్‌లైన్‌’ వెంకటేశ్‌ శ్వాస తీసుకోవటంలో ఇబ్బంది పడటంతో బెంగళూరులోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారట....
09-07-2020
Jul 09, 2020, 20:21 IST
ఢిల్లీ : ఆసియాక‌ప్ నిర్వ‌హిద్దామ‌నుకున్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ)కి ఆసియా క్రికెట్ కౌన్సిల్(ఏసీసీ) గ‌ట్టి షాక్ ఇచ్చింది. క‌రోనా నేప‌థ్యంలో ఆసియా‌...
09-07-2020
Jul 09, 2020, 19:21 IST
లండన్‌ : కరోనా మహమ్మారిని నిలువరించేందుకు ప్రపంచ దేశాలు అష్టకష్టాలు పడుతున్నసమయంలో మరో సంచలన విషయం వెలుగు చూసింది. కోవిడ్‌-19...
09-07-2020
Jul 09, 2020, 18:48 IST
ఢిల్లీ : దేశ వ్యాప్తంగా క‌రోనా వైర‌స్ ఉదృతికి ఢిల్లీలో జ‌రిగిన నిజాముద్దీన్ మ‌ర్క‌జ్ తబ్లిగీ జమాత్‌ స‌మావేశం ప్ర‌ధాన పాత్ర...
09-07-2020
Jul 09, 2020, 17:10 IST
ముంబై : క‌రోనా రోగుల‌కు అందించే చికిత్సలో భాగంగా బృహన్ ముంబై మునిసిపల్ కార్పొరేషన్ (బిఎంసి)  ఏర్పాటు చేసిన  ప్లాస్మా...
09-07-2020
Jul 09, 2020, 16:17 IST
న్యూఢిల్లీ :  భార‌త్‌లో క‌రోనా మ‌హ‌మ్మారి ఇంకా సామాజిక వ్యాప్తి( క‌మ్యూనిటీ ట్రాన్స్‌మిష‌న్ ) ద‌శ‌కు చేరుకోలేద‌ని ఆరోగ్య శాఖ...
09-07-2020
Jul 09, 2020, 15:07 IST
ఫ‌రిదాబాద్ :  గ్యాంగ్‌స్ట‌ర్ వికాస్ దుబే అనుచ‌రుల్లో ఒక‌రికి క‌రోనా పాజిటివ్ అని తేలింది. మంగ‌ళ‌వారం దూబె ప్ర‌ధాన అనుచ‌రులు...
09-07-2020
Jul 09, 2020, 14:54 IST
సాక్షి, చెన్నై: భారత్​లో కోవిడ్​–19 వ్యాప్తి రేటు బాగా పెరిగిందట. మార్చి నెలతో పోల్చుకుంటే ప్రస్తుత వ్యాప్తి రేటులో గణనీయమైన...
09-07-2020
Jul 09, 2020, 14:24 IST
కాంటాబ్రియా : క‌రోనా నేప‌థ్యంలో ప్ర‌పంచంలో ఏ చోట చూసిన వ‌ర్క్ ఫ్రం హోం సాధార‌ణ‌మైపోయింది. వ‌ర్క్ ఫ్రం చేస్తూనే త‌మ‌కు...
09-07-2020
Jul 09, 2020, 13:53 IST
తిరువ‌నంత‌పురం: కేర‌ళలోని పుంథూరా గ్రామంలో మొట్ట‌మొద‌టి క‌రోనా క్ల‌స్ట‌ర్ ఏర్పాటైంది. అత్య‌ధిక సూప‌ర్ స్ప్రెడ‌ర్‌ల‌ను గుర్తించిన అధికారులు వెంట‌నే ఆ...
09-07-2020
Jul 09, 2020, 13:31 IST
వరంగల్‌ క్రైం: కరోనా పాజిటివ్‌ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఈ మేరకు మాస్క్‌ లేకుండా బయటకు రావొద్దని, అత్యవసర పనులపై...
09-07-2020
Jul 09, 2020, 13:14 IST
హైబీపీ వచ్చి మెదడులో బ్లడ్‌ క్లాట్‌ అయిన వ్యక్తి నగరంలోని ఓ కార్పొరేట్‌ ఆస్పత్రిలో చేరాడు. అతడికి ట్రీట్‌మెంట్‌ పేరుతో...
09-07-2020
Jul 09, 2020, 12:38 IST
దేశంలోనే అత్యధిక జనాభా కలిగిన ఉత్తరప్రదేశ్‌ ఇతర రాష్ట్రాలతో పోలిస్తే కరోనాను కట్టడిలో మెరుగైన ఫలితాలు సాధించడం విశేషం.
09-07-2020
Jul 09, 2020, 11:14 IST
భారత్‌లో కొనసాగిన కోవిడ్‌-19 కేసుల ఉధృతి
09-07-2020
Jul 09, 2020, 10:11 IST
పట్నా :  క‌రోనా కేసులు అంత‌కంత‌కూ పెరుగుతున్న నేప‌థ్యంలో బిహార్ రాజ‌ధాని పట్నాలో  లాక్‌డౌన్ విధింపున‌కు కార్య‌చ‌ర‌ణ సిద్ధమైంది. పట్నాలో...
09-07-2020
Jul 09, 2020, 09:14 IST
కర్ణాటక, యశవంతపుర: సీనియర్‌ నటి జయంతి  ఆరోగ్యం కొంతవరకు మెరుగు పడినట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. ఊపిరి ఆడకపోవడం, ఆస్తమా...
09-07-2020
Jul 09, 2020, 08:41 IST
సాక్షి, చెన్నై: కరోనా కట్టడి విధుల్లో ఉన్న కార్పొరేషన్‌ అసిస్టెంట్‌ ఇంజినీర్‌ ఒకరు వలంటీరుగా సేవకు వచ్చిన ఓ కళాశాల...
09-07-2020
Jul 09, 2020, 06:43 IST
పంజగుట్ట: ప్రగతి భవన్‌ వద్ద ఓ యువకుడు మెరుపు నిరసన చేశాడు. బుధవారం మధ్యాహ్నం బైక్‌పై వచ్చిన ఓ యువకుడు...
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top