
రాష్ట్ర ప్రజలకు సీఎం కేసీఆర్ సంక్రాంతి శుభాకాంక్షలు
ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు రాష్ట్ర ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు రాష్ట్ర ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈసారి వర్షాలు సంతృప్తికర స్థాయిలో కురవడంతో రాష్ట్ర వ్యాప్తంగా సంతోషకరమైన వాతావరణంలో పండుగ జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. ప్రజలు ఆనందోత్సాహాలతో సంక్రాంతి పండుగ నిర్వహించుకోవాలన్నారు. పాడిపంటలతో రాష్ట్రం తులతూగేలా దీవించాలని భగవంతుడిని ఆయన ప్రార్థించారు.