వరంగల్‌లో సీఐడీ విచారణ | cid enquiry in warangal district | Sakshi
Sakshi News home page

వరంగల్‌లో సీఐడీ విచారణ

Jul 28 2016 3:07 AM | Updated on Aug 11 2018 8:21 PM

ఎంసెట్-2 లీకేజీ దర్యాప్తులో భాగంగా సీఐడీ అధికారులు బుధ వారం వరంగల్ జిల్లా పరకాల, భూపాలపల్లిలో విచారణ జరిపారు.

పరకాల: ఎంసెట్-2 లీకేజీ దర్యాప్తులో భాగంగా సీఐడీ అధికారులు బుధ వారం వరంగల్ జిల్లా పరకాల, భూపాలపల్లిలో విచారణ జరిపారు. అనుమానిత ర్యాంకర్ల తల్లిదండ్రులను ప్రశ్నించారు.

విద్యార్థులు ఎక్కడ చదివారు, పదో తరగతి, ఇంటర్‌లో ఎన్ని మార్కులు వచ్చాయి, ఎంసెట్‌కు ఎక్కడ కోచింగ్ తీసుకున్నారు, ఎక్కడ పరీక్ష రాశారు తదితర అంశాలపై ఆరా తీశారు. ఫోన్ నంబర్లు తీసుకొని వారి మొబైల్స్‌కు వచ్చిన కాల్‌లిస్ట్‌ను పరిశీలించారు. కాగా, ప్రకాశం జిల్లా కనిగిరిలో ఖాశిం అనే యువకుడిని అదుపులోకి తీసుకొని వదిలేశారు. లీకేజీ వ్యవహారంలో ప్రధాన నిందితులతో సంబంధం ఉందని అనుమానిస్తున్న రమేశ్(ఖాశిం సమీప బంధువు)ను అధికారులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement