చికెన్‌ @ రూ.250 | Sakshi
Sakshi News home page

చికెన్‌ @ రూ.250

Published Fri, May 15 2020 9:37 AM

Chicken Prices Rises in Hyderabad - Sakshi

సాక్షి, సిటీబ్యూరో: సిటీలో చికెన్‌ ధర పైపైకి వెళ్తోంది. గత మూడు నెలల్లో ఎన్నడూ లేనివిధంగా కిలో చికెన్‌ ధర రూ.250కు చేరుకుంది. కోవిడ్‌ వైరస్‌ ప్రభావంతో గత మూడు నెలల నుంచి చికెన్‌ వినియోగం దాదాపు 70–80 శాతం వరకు పడిపోవడంతో ధరలు బాగా తగ్గాయి. మార్చిలోపరిస్థితి మరీ దిగజారింది. ఒక దశలో కిలో కోడి వందలోపే ఉంది. మే రెండవ వారం నుంచి కాస్త చికెన్‌ వినియోగం పెరగడం..రంజాన్‌ నెల కొనసాగుతున్న దృష్ట్యా కూడా చికెన్‌ ధరలు పెరిగాయని హోల్‌సేల్‌ వ్యాపారులు చెబుతున్నారు. సాధారణ రోజుల్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 4 లక్షల నుంచి 5 లక్షల కిలోల వరకు చికెన్‌ విక్రయాలు జరుగుతాయి. ఆదివారం రోజు రాష్ట్ర వ్యాప్తంగా 70 లక్షల కిలోల విక్రయాలు జరుగుతాయి.

పండుగ రోజు దాదాపు 1.5 కోట్ల కిలోల వరకు విక్రయాలు జరిగాయని మార్కెట్‌ వర్గాల అంచనా. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కోళ్ల డిమాండ్‌ పూర్తి కాకపోవడంతో ధరలు ఇంకా పెరిగే అవకాశం ఉందని హోల్‌సేల్‌ వ్యాపారులు చెబుతున్నారు. కానీ గత మూడు నెలల నుంచి కోవిడ్‌ వైరస్‌ ప్రభావంతో చికెన్‌ వినియోగం భారీగా తగ్గింది. దీంతో పౌల్ట్రీ పరిశ్రమ రూ.వంద కోట్ల నష్టాల్లో కూరుకుపోయింది. ఇప్పుడిప్పుడు చికెన్‌ వినియోగం కాస్త కూస్తో పెరిగింది. దీంతో ధరలు కాస్త పెరిగాయి. ఇక నగరంలోని పలు పెద్ద హోల్‌సేల్‌ షాపుల్లో కిలో కోడి ధర రూ. 115 నుంచి రూ.120 పలుకుతుంది. ఇక బహిరంగ మార్కెట్‌లో కిలో కోడి ధర రూ.150 వరకు అమ్ముతున్నారు. డ్రెస్‌డ్‌ చికెన్‌ ధర పెద్ద హోల్‌సేల్‌ మార్కెట్‌లో రూ.200 వరకు ఉండాగా అదే స్కిన్‌లెస్‌ కిలో చికెన్‌ ధర రూ.250 దాటుతుంది. ఇక బహిరంగ మార్కెట్‌లో కిలో చికె¯Œన్‌ రూ.250 నుంచి రూ.260 వరకు ఉంది. కోడిగుడ్డు ధర హోల్‌సేల్‌లో రూ.3.50 పైసలు ఉంది. హోల్‌సేల్‌లో రూ.4 వరకు ఉంది.

Advertisement
Advertisement