
నయీం కేసును నీరుగార్చిన సర్కార్
అధికార పార్టీ సహా ఇతర పార్టీల నేతల తో సంబంధాలుండటం వల్లే సీఎం కేసీఆర్ నయీం కేసు ను నీరుగార్చారని తెలంగాణ ఇంటి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు చెరుకు సుధాకర్ ఆరోపించారు.
నేరెళ్ల ఘటనపై స్పందించని ప్రభుత్వం: చెరుకు
పెద్దపల్లిరూరల్: అధికార పార్టీ సహా ఇతర పార్టీల నేతల తో సంబంధాలుండటం వల్లే సీఎం కేసీఆర్ నయీం కేసు ను నీరుగార్చారని తెలంగాణ ఇంటి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు చెరుకు సుధాకర్ ఆరోపించారు. పెద్దపల్లి మండలం అప్పన్నపేటలో శుక్రవారం ఆయన విలేకరు లతో మాట్లాడారు. నయీం ఎన్‌కౌంటర్ జరిగిన తర్వాత లభ్యమైన డైరీలో లభించిన ఆధారాలు, ఆయన స్థావరాల్లో లభ్యమైన సొమ్ము ను ఏం చేశారో ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత పాలకులపై ఉందన్నారు.
నేరెళ్ల ఘటనపై ప్రభుత్వం స్పందించకపోవడాన్ని బట్టి చూస్తే ఇసుక మాఫియాకు సర్కార్ అండగా ఉంటోదనే సంకేతాలను ఇస్తోందని ఆరోపించారు. ఇసుక మాఫియాపై చర్యలు తీసుకోకుండా సామాన్యులపై థర్డ్ డిగ్రీ ప్రయోగించడం టీఆర్‌ఎస్ సర్కార్‌కే చెల్లిందన్నారు. సీఎం కేసీఆర్, ఆయన కుటుంబీకులు రాష్ట్రాన్ని సొంత జాగీరులా భావిస్తున్నారన్నారు. హోంమంత్రి నాయిని ప్రారం భోత్సవ కార్యక్రమాలకు తప్ప దేనికి పనికిరాడన్నారు.