రసాయనాల లారీ అగ్నికి ఆహుతి | chemical load truck burnt in khammam | Sakshi
Sakshi News home page

రసాయనాల లారీ అగ్నికి ఆహుతి

Apr 25 2014 9:12 AM | Updated on Sep 2 2017 6:31 AM

ఖమ్మం జిల్లా తల్లాడ మండలం వెంకటగిరి క్రాస్‌రోడ్డు దగ్గర రసాయనాల లోడ్‌తో వెళుతున్న లారీ అగ్నికి ఆహుతైంది.

ఖమ్మం జిల్లా తల్లాడ మండలం వెంకటగిరి క్రాస్‌రోడ్డు దగ్గర రసాయనాల లోడ్‌తో వెళుతున్న లారీ అగ్నికి ఆహుతైంది. లారీలో హైడ్రోజన్ పెరాక్సైడ్‌ ఉన్నట్టు సమాచారం. హైదారాబాద్‌ నుంచి విశాఖపట్నం వెళుతుండగా విరామం కోసం డ్రైవర్ లారీని ఆపాడు.

ఈ సమయంలో ఉన్నట్టుండి లారీలో మంటలు చెలరేగాయి. చూస్తుండగానే లారీ పూర్తిగా కాలిబూడిదైంది. ఎండ తీవ్రత వల్లే రసాయనాలకు నిప్పంటుకోవచ్చని స్థానికులు అన్నారు. ఈ ప్రమాదంతో రోడ్డువెంట ట్రాఫిక్ పూర్తిగా నిలిచిపోయింది.

Advertisement
 
Advertisement
Advertisement