వేటగాళ్ల ఉచ్చుకు చిరుత బలి | Sakshi
Sakshi News home page

వేటగాళ్ల ఉచ్చుకు చిరుత బలి

Published Thu, Jun 1 2017 12:01 AM

వేటగాళ్ల ఉచ్చుకు చిరుత బలి - Sakshi

- నీటి కోసం వచ్చి.. ఉచ్చులో చిక్కగా ఉరిపడిన వైనం
సిద్దిపేట జిల్లా మహ్మదాపూర్‌ గుట్టల్లో ఘటన
 
హుస్నాబాద్‌ రూరల్‌: నీటి కోసం కొండ దిగిన చిరుత వేటగాళ్ల ఉచ్చులో చిక్కి బలైంది. దాదాపు 8 గంటలపాటు తండ్లాడిన చిరుత చివరకు ప్రాణం విడిచింది. ఈ ఘటన సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌ మండలం మహ్మదాపూర్‌ గుట్టల్లో బుధ వారం వెలుగు చూసింది. అనభేరి ప్రభాకర్‌ రావు సమాధుల సమీపంలో ఉపాధిహామీ పనులు చేసేందుకు బుధవారం ఉదయం కూలీలు వెళ్లారు. వీరికి దుర్వాసన రావడంతో చుట్టు పక్కల గాలించగా చిరుత పులి కళేబరం కనిపించింది.  

వెంటనే అటవీ అధికారులకు సమాచారమిచ్చారు. చిరుత నాలుగు కాళ్లు నరికేసి ఉన్నాయి. చిరుత కాళ్లకు, మెడకు ఉరి పడ్డట్లు తెలుస్తోంది. ఉచ్చుల నుంచి తప్పించుకోవడానికి చిరుత 7 నుంచి 8 గంటలపాటు పెనుగులాడినట్టు శరీరంపై ఉన్న గాయాల ఆధారంగా తెలుస్తోంది.  చిరుత ఎక్కడో ఉచ్చుకు చిక్కి చనిపోగా... వేటగాళ్లు గుట్ట మీదకు తీసుకొచ్చి, చిరుత గోళ్ల కోసం దాని కాళ్లు నరికి తీసుకెళ్లినట్టు అటవీ అధికారులు అనుమానిస్తున్నారు. చిరుత కళేబరం నుంచి కొన్ని భాగాలను ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు అటవీ అధికారులు పంపించారు. ఆ నివేదిక ఆధారంగా దర్యాప్తు చేస్తామని డీఎఫ్‌ఓ శ్రీధర్‌రావు తెలిపారు.

Advertisement
Advertisement