సమగ్ర కుటుంబ సర్వేకు సిద్ధం కండి | Check List for Telangana Intensive Household Survey | Sakshi
Sakshi News home page

సమగ్ర కుటుంబ సర్వేకు సిద్ధం కండి

Aug 14 2014 8:06 PM | Updated on Aug 11 2018 7:54 PM

సమగ్ర కుటుంబ సర్వేకు సిద్ధం కండి - Sakshi

సమగ్ర కుటుంబ సర్వేకు సిద్ధం కండి

తెలంగాణ ప్రభుత్వం నిర్వహించనున్న ‘కుటుంబ సమగ్ర సర్వే’పై ప్రజలకు ఎన్నో అనుమానాలు.. మరెన్నో సందేహాలు..

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం నిర్వహించనున్న ‘కుటుంబ సమగ్ర సర్వే’పై ప్రజలకు ఎన్నో అనుమానాలు.. మరెన్నో సందేహాలు.. ఈ నెల 19న ఇళ్లకు వచ్చే సర్వే సిబ్బందికి ఎలాంటి ఆధారాలు చూపించాలన్న అంశంపై ఇంతవరకూ స్పష్టత లేదు. ఈ నేపథ్యంలో ప్రజలు తమ వద్ద ఉంచుకోవాల్సిన వివరాల జాబితాను జీహెచ్‌ఎంసీ అధికారులు రూపొందించారు.

తెలుగు, ఇంగ్లిష్, హిందీ భాషల్లో రంగుల కరపత్రాలు ముద్రించి దినపత్రికలతో పాటు ఇంటింటికీ పంపిణీ చేస్తున్నారు. రెండు రోజుల ముందు నుంచే ఎన్యుమరేటర్లు ఇళ్లకు వెళ్లి ప్రజలకు అవసరమైన సమాచారం అందజేస్తారు. వారు వెళ్లిన ఇళ్లకు జీహెచ్‌ఎంసీ ప్రత్యేకంగా తయారుచేసిన స్టిక్టర్‌ను అంటిస్తారు. దానిపై స్టిక్కర్‌పై సర్వేకు ముందు 17, 18 తేదీల్లో.. సర్వే రోజున 19న ఎన్యుమరేటర్లు వచ్చినట్లు నమోదు చేసే బాక్స్‌లున్నాయి.

ఎన్యూమరేటర్ ఫోన్ నంబరు కూడా ఉంటుంది. సందేహాలుంటే ఆ నంబర్‌కు ఫోన్ చేయవచ్చు. 17న ఎన్యుమరేటర్ ఇంటికి రాకుంటే జీహెచ్‌ఎంసీ కాల్‌సెంటర్ నంబరు 040-21111111కు ఫోన్‌చేసి ఫిర్యాదు చేయవచ్చు. దానిని పలిరిశీలించి ఉన్నతాధికారులు చర్యలు తీసుకుంటారు. గ్యాస్ కనెక్షన్, పాస్‌పోర్టు, ఇతర సదుపాయాలు కావాలనుకునేవారు కుటుంబ వివరాలు తప్పనిసరిగా అందజేయాలి. ఆస్తిపన్ను, విద్యుత్, నల్లాకనెక్షన్లకు సంబంధిం చిన బిల్లు రసీదులు, కుల, వికలాంగ ధ్రువీకరణ పత్రాల జిరాక్స్‌లు అందుబాటులో ఉంచుకోవాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement