టెర్మినల్ పేరు మార్పుపై ఉద్యమిస్తాం: వీహెచ్ | chandrababu fowl play for shamshabad airport name changed | Sakshi
Sakshi News home page

టెర్మినల్ పేరు మార్పుపై ఉద్యమిస్తాం: వీహెచ్

Nov 28 2014 2:12 AM | Updated on Sep 19 2019 8:28 PM

టెర్మినల్ పేరు మార్పుపై ఉద్యమిస్తాం: వీహెచ్ - Sakshi

టెర్మినల్ పేరు మార్పుపై ఉద్యమిస్తాం: వీహెచ్

చంద్రబాబు కుట్రపూరితంగా శంషాబాద్ విమానాశ్రయంలో దేశీయ టెర్మినల్‌కు ఎన్టీఆర్ పేరు పెట్టించారని కాంగ్రెస్ ఎంపీ వి.హన్మంతరావు ఆరోపించారు.

సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో పార్టీ నాయకులంతా ఒక్కొక్కరూ ఇతర పార్టీల్లోకి వెళుతుండడంతో, ఇక్కడి సెటిలర్లలో కొత్త ఊపు తెచ్చేందుకే చంద్రబాబు కుట్రపూరితంగా శంషాబాద్ విమానాశ్రయంలో దేశీయ టెర్మినల్‌కు ఎన్టీఆర్ పేరు పెట్టించారని కాంగ్రెస్ ఎంపీ వి.హన్మంతరావు ఆరోపించారు. గురువారం ఆయన విజయ్‌చౌక్‌లో మీడియాతో మాట్లాడారు.

దేశంలో ఏ విమానాశ్రయానికి రెండు పేర్లు లేవని, కేంద్రం ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయం వెనక్కి తీసుకోక పోతే పార్లమెంట్‌ను స్తంభింపజేస్తామని హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా జిల్లా స్థాయిలో ఉద్యమాలు రూపొందిస్తామని చెప్పారు.
 

Advertisement
 
Advertisement
Advertisement