ప్లీజ్‌ ఆదుకోండి.. హరిరామజోగయ్య పేరిట వీహెచ్‌కు ఫోన్ చేసి.. 

Fake Cyber Crime Call To Congress Leader Hanumantha Rao - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సైబర్‌ నేరాలకు పాల్పడుతున్న కేటుగాళ్లు మరోసారి రెచ్చిపోయారు. కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వీ. హనుమంతరావును టార్గెట్‌ చేసి డబ్బులు దోచుకునే ప్రయత్నం చేశారు. మాజీ ఎంపీ హరి రామజోగయ్య పేరిట డబ్బు కాజేయాలని చూశాను. కానీ, వీహెచ్‌ తెలివిగా వ్యవహరించి.. కేటుగాళ్లకు టోకరా ఇచ్చారు. 

వివరాల ప్రకారం.. కాంగ్రెస్‌ సీనియన్‌ నేత వీహెచ్‌ను మోసగించేందుకు ఓ సైబర్‌ నేరగాడు యత్నించాడు. మాజీ ఎంపీ హరి రామజోగయ్య పేరిట వీహెచ్‌కు ఫోన్ చేసి.. ఆపదలో ఉన్నానని, గూగుల్‌పే ద్వారా డబ్బు పంపాలని సదరు వ్యక్తి అభ్యర్థించాడు. ఈ క్రమంలో అనుమానం వచ్చి వీహెచ్‌.. హరిరామ జోగయ్య ఇంటికి ఓ వ్యక్తిని పంపించారు. అలాంటిదేమీ లేదని తేలడంతో ఫేక్‌ కాల్‌ అని వీహెచ్‌ నిర్ధారించుకున్నారు. 

అనంతరం.. ఫేక్‌ కాల్‌పై పశ్చిమగోదావరి జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా సైబరాబాద్‌ పోలీసులకు కూడా సమాచారం అందించారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు సైబర్‌ నేరగాడు ఖమ్మం నుంచి ఫోన్‌ చేసినట్లు గుర్తించారు. నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు యత్నిస్తున్నారు. ఇక, ఇటీవలి కాలంలో ఇలాంటి కాల్స్‌, మెసేజ్‌ల ద్వారా సైబర్‌ కేటుగాళ్లు డబ్బులు కాజేస్తున్న విషయం తెలిసిందే. 

ఇది కూడా చదవండి: బీఆర్‌ఎస్‌ అభ్యర్థి ఎలా గెలుస్తాడో చూస్తా.. రేఖా నాయక​్‌ స్ట్రాంగ్‌ వార్నింగ్‌

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top