జగన్నాథపూర్‌లో చైన్ స్నాచింగ్ | Chain snatching in Jagannathpur | Sakshi
Sakshi News home page

జగన్నాథపూర్‌లో చైన్ స్నాచింగ్

Jan 8 2016 6:08 PM | Updated on Sep 3 2017 3:19 PM

ఎల్కదుర్తి మండలం జగన్నాథపూర్ గ్రామంలో శుక్రవారం సాయంత్రం బంగారు గొలుసు చోరీ జరిగింది. పొలం నుంచి ఇంటికి వెళ్తున్న చల్లూరి మనోహర(60) అనే వృద్ధురాలి మెడలోని పుస్తెల తాడును గుర్తుతెలియని వ్యక్తులు లాక్కెళ్లారు.

ఎల్కదుర్తి (కరీంనగర్ జిల్లా) : ఎల్కదుర్తి మండలం జగన్నాథపూర్ గ్రామంలో శుక్రవారం సాయంత్రం బంగారు గొలుసు చోరీ జరిగింది. పొలం నుంచి ఇంటికి వెళ్తున్న చల్లూరి మనోహర(60) అనే వృద్ధురాలి మెడలోని పుస్తెల తాడును గుర్తుతెలియని వ్యక్తులు లాక్కెళ్లారు. పుస్తెల తాడు రెండున్నర తులాలు ఉంటుందని, ఇద్దరు దొంగలు బైక్‌పై వచ్చినట్లు బాధితురాలు తెలిపింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Advertisement
 
Advertisement
Advertisement