‘టీఆర్‌ఎస్‌ ప్లీనరీలో సమాధానమిస్తాం’ | Centre and State collaboration to promote Handloom and Handicrafts in delhi | Sakshi
Sakshi News home page

‘టీఆర్‌ఎస్‌ ప్లీనరీలో సమాధానమిస్తాం’

Apr 26 2018 4:43 PM | Updated on Mar 18 2019 9:02 PM

 Centre and State collaboration to promote Handloom and Handicrafts in delhi - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: హస్తకళల ప్రోత్సాహానికి తెలంగాణ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టిందని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. ఢిల్లీలోని ఎన్‌డీఎంసీ కన్వెన్షన్ సెంటర్‌లో కేంద్రమంత్రి స్మృతి ఇరానీ నేతృత్వంలో గురువారం అన్ని రాష్ర్టాల జౌళి శాఖ మంత్రుల సమావేశం నిర్వహించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో చేనేత, హస్తకళల రంగానికి ఊతమిచ్చేందుకు ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో మంత్రి కేటీఆర్‌ మాట్లాడారు. జియోట్యాగింగ్ ద్వారా చేనేత మగ్గాలను గుర్తించి, వారి అభివృద్ధికి ప్రభుత్వం పలు చర్యలు చేపట్టిందన్నారు.

చేనేత పరిశ్రమ అభివృద్ధి కోసం తెలంగాణలో రెండు కార్పొరేషన్లు ఏర్పాటు చేశామని చెప్పారు. దేశంలో ఎక్కడాలేని విధంగా నూలుకు, అద్దకాలకు సబ్సిడీ ఇస్తున్నట్లు చెప్పారు. చేనేత మగ్గాలు ఎక్కడున్నా వాటికి యూనిక్‌ కోడ్‌లు ఏర్పాటు చేశామన్నారు. చేనేత కార్మికులకు హెల్త్‌, లైఫ్‌ ఇన్సూరెన్స్‌ ఇవ్వాలని మంత్రి కోరారు. తెలంగాణలో చేనేత క్లస్టర్స్‌ ఏర్పాటు చేయాలని కేటీఆర్‌ కేంద్రానికి విజ్ఞప్తి చేశారు.

మరోవైపు అసెంబ్లీలో సమస్యలపై మాట్లాడమంటే కాంగ్రెస్‌ నాయకులకు చేతకాదని విమర్శించారు. అసెంబ్లీ బయట సమస్యలపై మాట్లాడే పరిస్థితి కాంగ్రెస్‌కు లేదన్నారు. టీఆర్‌ఎస్‌ ప్లీనరీ వేదికగా కాంగ్రెస్‌ పార్టీ చేస్తున్న అన్నీ విమర్శలకు సమాధానమిస్తామని కేటీఆర్‌ అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement