రిస్క్‌ జోన్స్‌

Central Department Of Health And Family Welfare Has Issued Guidelines For Risk Zones - Sakshi

అపార్ట్‌మెంట్లు, గేటెడ్‌లోనే వేగంగా కరోనా వ్యాప్తి

జాగ్రత్తలు తీసుకోకుంటే కేసులు ఎక్కువయ్యేది ఇక్కడే

పలు సూచనలతో కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మార్గదర్శకాలు జారీ

సాక్షి, హైదరాబాద్‌: కరోనా వైరస్‌ వ్యాప్తి మరింత తీవ్రమవుతోంది. గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే పట్టణ ప్రాంతాల్లో వైరస్‌ వేగంగా వ్యాప్తి చెందుతున్నట్లు కేంద్ర ఆరోగ్య, కుటుం బ సంక్షేమ మంత్రిత్వ శాఖ చెబుతోంది. కుటుంబంలో ఎవరికైనా కరోనా సోకితే అది ఒక్కరికే పరిమితం కావడం లేదని, కుటుంబ సభ్యుల్లో సగటున 60 శాతానికి పైగా సోకుతోందని విశ్లేషించింది. కరోనా వైరస్‌ భారినపడుతున్న వారిలో ఎక్కువగా అపార్ట్‌మెంట్లు, గేటె డ్‌ కమ్యూనిటీ సొసైటీలు, రెసిడెన్షియ ల్‌ కాంప్లెక్స్‌ల్లో ఉండే వారే ఎక్కువగా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సం క్షేమ మంత్రిత్వ శాఖ పరిశీలనలో తే లింది. ప్రస్తుతం వైరస్‌ వ్యాప్తి అంచనాకందే స్థితిలో ఉన్నప్పటికీ జాగ్రత్తలు పాటించకుంటే వ్యాప్తి వేగం మరింత పెరుగుతుందని హెచ్చరిస్తోంది. ఈ మేరకు ప్రత్యేకంగా మార్గదర్శకాలు విడుదల చేసింది. ఈ మార్గదర్శకాల ప్రతులను కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వెబ్‌సైట్‌లో కూడా అందుబాటులో పెట్టింది.

నిఘా కట్టుదిట్టం చేస్తేనే...
గేటెడ్‌ కమ్యూనిటీ సొసైటీలు, అపార్డ్‌మెంట్‌ల్లో ఎక్కువ సం ఖ్యలో కుటుంబాలు ఉండడంతో సాధారణంగా రాకపోకలు అధికంగానే ఉంటాయి. నివాసితులతో పాటు వారి కో సం వచ్చే విజిటర్స్‌ సంఖ్య కూడా ఎక్కువే. ఈ క్రమంలో నిఘా కట్టుదిట్టం చేసి జాగ్రత్తలు పాటిస్తేనే కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టవచ్చని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షే మ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. విజిటర్స్‌ను అనుమతించేటప్పుడు థర్మల్‌ స్క్రీనింగ్‌తో పాటు మాస్కు, హ్యాండ్‌వాష్‌ లేక శానిటైజర్‌తో చేతు లు శుభ్రం చేసుకున్న తర్వాతే లోనికి రానివ్వాలి.

అత్యవసర పరిస్థితుల్లో తప్ప బయటకు వెళ్లొద్దని చెబుతున్న ప్రభుత్వం... ముఖ్యంగా 60 ఏళ్లు పైబడిన పదేళ్లలోపు పిల్లలంతా ఇంటికే పరిమితం కావాలని స్పష్టం చేసింది.  కరోనా వైరస్‌ వ్యాప్తిని నిలువరించేందుకు ప్రతి ఒక్కరూ ఆరడుగుల భౌతికదూరం పాటించాలి. అదేవిధంగా ముఖానికి ఫేస్‌షీల్డ్‌లు లేదా 3 లేయర్ల మాస్కు లు తప్పకుండా ధరించాలి. ఇతర వస్తువులు, వేరేచోట్ల చేతులతో తాకాల్సిన పరిస్థితుల్లో తప్పకుండా హ్యాండ్‌వాష్‌ లేదా శానిటైజర్లతో చేతుల్ని శుభ్రంగా కడగాలి. బహిరంగంగా ఉమ్మివేయడాన్ని పూర్తిగా నిషేధించాలి.

నిర్లక్ష్యం చేస్తున్నారు...
కోవిడ్‌–19ను ఎదుర్కొవాలంటే ఈ వ్యాధి వ్యాప్తి, నిలువరిం చే అంశాలపై అవగాహన అతిముఖ్యమని ప్రభుత్వం చెబు తోంది. ఈ దిశగా ప్రచార కార్యక్రమాలు ముమ్మరం చేసింది. కానీ జాగ్రత్తలు పాటించడంలో చాలామంది నిర్లక్ష్యం చూపుతున్నారనే అభిప్రాయాన్ని కేంద్రం వ్యక్తం చేస్తోంది. అపార్ట్‌మెంట్, గేటెడ్‌ కమ్యూనిటీ సముదాయాల్లో నివాసితులు అవాస ప్రాంత పరిస్థితులపై సామాజిక మాధ్యమాల్లో చర్చిం చుకుంటే మరింత స్పష్టత వస్తుందని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే పలు అపార్ట్‌మెంట్లు, గేటెడ్‌ కమ్యూనిటీ సొసైటీలు, ఇతర కాలనీల్లో ఉంటున్న వారంతా వాట్సాప్, ఫేస్‌బుక్, ట్విట్టర్‌ తదితర సామాజిక మాధ్యమాల్లో టచ్‌లో ఉంటున్నారు. ఈ పద్ధతిని అందరూ కొనసాగిస్తే తాజా సమాచారం ఎప్పటికప్పుడు తెలిసిపోతుంది. ఇలాంటి జాగ్రత్తలు పాటిస్తే కోవిడ్‌–19ను వీలైనంత వరకు నిలువరించవచ్చునని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సూచించింది. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top