విధులను కొద్దిసేపు పక్కన పెట్టి వేతన ఫిట్‌మెంట్ సంబురాల్లో మునిగి తేలిన ఓ డ్రైవర్ చివరకు సస్పెండ్‌కు ....
వరంగల్ అర్బన్ : విధులను కొద్దిసేపు పక్కన పెట్టి వేతన ఫిట్‌మెంట్ సంబురాల్లో మునిగి తేలిన ఓ డ్రైవర్ చివరకు సస్పెండ్‌కు గురయ్యారు. మహానగర పాలక సంస్థ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ శుక్రవారం మధ్యాహ్నం ప్రధాన కార్యాలయానికి చేరుకున్నారు. అదే సమయంలో బల్దియా ఎదుట జేఏసీ నాయకులు, ఉద్యోగులు వేతన ఫిట్‌మెంట్‌పై సంబురాలు జరుపుకునే పనిలో నిమగ్నమయ్యారు. కమిషనర్ చాంబర్‌లో పవ ర్ పాయింట్ ప్రజెంటేషన్ జరుగుతుందనే విష యం తెలిసి ఆటంకం కలుగుతుందని గంట న్నరపాటు వేచిచూశారు. సమావేశం పూర్తికాగా నే బాణాసంచా పేల్చి, స్వీట్లు పంపిణీలు చేసుకున్నారు. సంబురాల్లో కమిషనర్ వాహన డ్రైవ ర్, డ్రైవర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు దొడ్డిపాటి శేఖర్ కూడా ఉన్నారు.
సమావేశం పూర్తికాగానే కమిషనర్ నేరుగా తన వాహనం ఎక్కి కూర్చున్నారు. 10 నిమిషాలపాటు వాహనంలో వేచి చూశారు. సీసీ, అటెండర్లు ఫోన్ చేయగా నెమ్మదిగా శేఖర్ అక్కడికి చేరుకోగానే ‘ఏంటి ఆలస్యమంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కమిషనర్ తన క్యాంపు కార్యాలయం హన్మకొండకు చేరిన తర్వాత డ్రైవర్ శేఖర్‌ను సస్పెండ్ చేయాలని అధికారులను ఆదేశించగా.. ఉత్తర్వులు జారీ చేశారు.