‘మూడో’కన్ను

CC Cameras Are Used In Polling Stations - Sakshi

పోలింగ్‌ కేంద్రాల వద్ద కెమెరాలు

పార్టీల గొడవలకు చెక్‌

ఇకపై ఆటలు సాగవంటున్న పోలీసులు

కోరుట్ల: ఓటింగ్‌ రోజున పోలింగ్‌ కేంద్రాల వద్ద పార్టీల గొడవలు.. ఓటర్లపై ఒత్తిళ్లకు చెక్‌ పెట్టే దిశలో పోలీసు యంత్రాంగం ఏర్పాట్లు ప్రారంభించింది. ఈ దిశలో అన్ని పోలింగ్‌ కేంద్రాల వద్ద సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాట్లు చేస్తున్నారు. పోలింగ్‌ కేంద్రం పరిసర ప్రాంతాల్లో ఎ న్నికల కోడ్‌ను ఉల్లఘించి పార్టీల నేతలు.. కార్యకర్తలు ఎలాంటి అవాంచనీయ సంఘటలకు పా ల్పడకుండా ఉండేందుకు చేపట్టిన ఈ చర్యలు మ ంచి ఫలితాలివ్వనున్నాయి. ఈ దిశలో ఇప్పటికే సెగ్మెంట్లవారీగా సీసీ కెమెరాలు అందించేందుకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేస్తోంది.
199 పోలింగ్‌ కేంద్రాలు
అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో జిల్లాలోని కోరుట్లలో 254 పోలింగ్‌ బూత్‌లుండగా.. 43 పోలింగ్‌ కేంద్రాలున్నాయి. జగిత్యాలలో 253 పోలింగ్‌ బూత్‌లుండగా.. 69, ధర్మపురిలో 269 బూత్‌లుండగా.. 87 పోలింగ్‌ కేంద్రాలున్నాయి. ఈ లెక్కన జగిత్యాల, ధర్మపురి, కోరుట్ల సెగ్మెంట్లలో కలుపుకొని మొత్తం 199 పోలింగ్‌ కేంద్రాలున్నాయి. ప్రతీ పోలింగ్‌ కేంద్రం వద్ద రెండు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడానికి జిల్లా పోలీసు యంత్రాంగం సంకల్పించింది. ఇంత పెద్ద మొత్తంలో సీసీ కెమెరాల ఏర్పాటుకు నిధుల లేమి కారణంగా ప్రస్తుతం అత్యంత సమస్యాత్మకంగా ఉన్న పోలింగ్‌ కేంద్రాలతోపాటు ఎక్కువ పోలింగ్‌ బూత్‌లున్న పోలింగ్‌ కేంద్రాలను గుర్తించి ఆయా కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేపట్టింది.
ఓటరుపై ఒత్తిడికి చెక్‌
పోలింగ్‌ రోజున చివరి నిమిషంలో ఓటర్లను తమవైపు మళ్లించుకోవడానికి ప్రతిసారి పోలింగ్‌ కేంద్రాల వద్ద పార్టీల నాయకులు తిష్ట వేయడం తెలిసిందే. పోలింగ్‌ కేంద్రాలకు వస్తున్న ఓటర్లను మభ్యపెట్టేందుకు ఆ సమయంలో పార్టీల నేతలు నానా యత్నాలు చేస్తారు. ఎన్నికల బరిలో ఉన్న పార్టీలకు చెందిన అభ్యర్థుల అనుచరులు.. కార్యకర్తలు గొడవలకు దిగే ఆస్కారముంటుంది. ఈక్రమంలో పోలింగ్‌ కేంద్రాల వద్ద ప్రశాంతత చెదిరి ఓటింగ్‌పై ప్రభావం చూపే అవకాశముంది. ఇలాంటి అవాంచనీయ సంఘటనలకు ఆస్కారం ఇవ్వకుండా సీసీ కెమెరా నిఘా పూర్తి ఫలితాలిస్తుందని అధికారులు ఆశిస్తున్నారు. సీసీ నిఘా మంచిదే అయినా.. వీటి ఏర్పాటు కోసం ప్రత్యేకంగా నిధులివ్వకపోడం సమస్యగా మారింది.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top