శ్రీకాంత్‌ మృతిపై సీబీఐతో విచారణ చేపట్టాలి

CBI Should Investigate On Gurukula Student Srikanth Death - Sakshi

శ్రీకాంత్‌ ఆత్మహత్య చేసుకోలేదు.. వాస్తవాలను తొక్కిపెడుతున్నారు

విద్యార్థి మృతిపై సమగ్ర విచారణ చేపట్టాలి

సాక్షి, వనపర్తి: గురుకుల విద్యార్థి శ్రీకాంత్‌ మృతిపై సమగ్ర విచారణ చేపట్టాలని మాదిగ ఉద్యోగ సమాఖ్య రాష్ట్ర కో కన్వీనర్‌ గద్వాల కృష్ణ డిమాండ్‌ చేశారు. మంగళవారం పట్టణంలోని యూటీఎఫ్‌ జి ల్లా కార్యాలయంలో గురుకుల విద్యార్థి మృతిపై నిర్వహించిన రౌండ్‌టేబుల్‌ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. మదనాపురం ఎస్సీ గురుకుల పాఠశాలలో ఇంటర్‌ ప్రథమ సంవత్సరం చదువుతున్న శ్రీకాంత్‌ ఆత్మహత్య చేసుకోలేదని, అధ్యాపకులు వాస్తవాలను తొక్కిపెడుతున్నారని ఆరోపించారు. హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారని ఈ నెల 7న విద్యార్థి మృతి చెందితే.. విద్యార్థి, ప్రజా సంఘాలు, మృతుని తల్లిదండ్రుల కళాశాలను సందర్శించగా పలు అనుమానాలు వెలుగు చూసినట్లు గుర్తు చేశారు. తోటి విద్యార్థులు కొందరు అధ్యాపకులపై అనుమానాలు వ్యక్తం చేసి పోలీసులకు ఫిర్యాదు చేశారన్నారు.

పోలీసులు సమగ్ర విచారణ  చేపట్టి  నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. గురుకులాల్లో ఉపాధ్యాయులు సక్రమంగా విధులకు హాజరుకావడం లేదని, రాత్రివేళల్లో   విద్యార్థుల పరిస్థితి దారుణంగా ఉంటుందని, పర్యవేక్షణ పూర్తిగా లోపించిందని, రాత్రివేళలో చాలా మం ది విద్యార్థులు బయటకు వెళ్తున్నారని పలు గురుకులాల నుంచి రిపోర్టు అందిందన్నారు. కే వీపీఎస్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి రాధాకృష్ణ అద్యక్షతన నిర్వహించిన రౌండ్‌టేబుల్‌  సమావేశంలో ఆయా సంఘాల అధ్యక్షులు,  నాయకులు   వెంకటస్వామి, వెంకటయ్య, లక్ష్మయ్య, గట్టుస్వామి, నాగన్న, సన్నయ్య,  భగత్,   గంగన్న,   నారాయణ, గణేష్,  రాము,   చెన్నకేశవులు, ప్రశాంత్, వంశీ, నిరంజన్, రవిప్రసాద్, వెంకటస్వామి, శ్రీనివాసులు, ఆంజనేయులు, అరవింద్, వీరప్ప పాల్గొన్నారు. 

సీబీఐతో విచారణ చేపట్టాలి
పెబ్బేరు (కొత్తకోట): గురుకుల విద్యార్థి శ్రీకాంత్‌ మృతిపై సీబీఐ విచారణ చేయాలని మంగళవారం మాదిగ స్టూడెంట్‌ ఫెడరేషన్‌ నాయకుడు ప్రశాంత్‌ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీకాంత్‌ది ముమ్మాటికి హత్యనే అన్నారు. దీనిపై ప్రభుత్వం సీబీఐతో సమగ్ర విచారణ చేపట్టి కారుకులైన వారిని కఠినంగా శిక్షించడంతోపాటు విద్యార్థి కుటుంబ సభ్యులకు న్యాయం చేయాలన్నారు. కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ  ఉద్యోగం  ఇవ్వాలని, తక్షణమే రూ.50 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని డిమాండ్‌ చేశారు. సమావేశంలో నాయకులు అభి, ప్రసాద్, మహేష్‌ పాల్గొన్నారు.    

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top