మెదక్ సరిహద్దుల్లో పోలీసుల కాల్పులు | Cattle smuggling in medak district | Sakshi
Sakshi News home page

మెదక్ సరిహద్దుల్లో పోలీసుల కాల్పులు

Jan 15 2015 11:30 AM | Updated on Oct 16 2018 3:12 PM

ఆవుల అక్రమ రవాణా చేస్తున్న వారిపై మెదక్ సరిహద్దుల్లో పోలీసులు కాల్పులు జరిపారు.

మెదక్: ఆవుల అక్రమ రవాణా చేస్తున్న వారిపై మెదక్ సరిహద్దుల్లో పోలీసులు కాల్పులు జరిపారు. రామాయంపేట సమీపంలో గురువారం తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకుంది. 3 చెక్ పోస్టుల వద్ద వాహనాన్నిఆపకుండా వెళ్తన్న డీసీఎం వ్యానును స్థానిక పోలీసులు వెంబడించారు. వ్యానులో ఆవులను తరలిస్తున్న 8 మంది హర్యానా వాసులు పోలీసులపై రాళ్లతో దాడి చేశారు.

ఈ దాడిలో రాయాయంపేట కానిస్టేబుల్ కు గాయాలయ్యాయి. దీంతో హర్యానా వాసులపై పోలీసలు కాల్పులు జరిపారు. పేట్ బషీర్ వద్ద డీసీఎంను పట్టుకొని  నిందితులను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి ఘటనపై విచారణ జరుపుతున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement