ఇద్దరి ప్రాణాలు తీసిన అతివేగం | car hits electric pole due to overspeed and two dies | Sakshi
Sakshi News home page

ఇద్దరి ప్రాణాలు తీసిన అతివేగం

May 19 2017 9:18 AM | Updated on Sep 5 2018 2:25 PM

వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న విద్యుత్‌ స్తంభాన్ని ఢీకొట్టింది.

కొల్లాపూర్‌: వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న విద్యుత్‌ స్తంభాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. ఈ ప్రమాదం నాగర్‌కర్నూలు జిల్లాలోని కొల్లాపూర్‌ మండలం అంకిరావుపల్లి వద్ద శుక్రవారం ఉదయం చోటుచేసుకుంది. పెద్దకొత్తపల్లి మండలం కల్వకోలు గ్రామానికి చెందిన రామకృష్ణ, మల్లేశ్‌లు కారులో కొల్లాపూర్‌ వెళ్తున్నారు.

వేగంగా వెళ్తున్న కారు అంకిరావుపల్లి దగ్గరకు రాగానే అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న విద్యుత్‌ స్తంభాన్ని ఢీకొట్టడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం దగర్లోని ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement