స్వీట్‌ హౌస్‌లోకి దూసుకెళ్లిన కారు

Car Accidentally Crashed into Sweet Shop Hyderabad - Sakshi

జవహర్‌నగర్‌: రోడ్డుపై వెళ్తున్న ఓ కారు అదుపుతప్పి స్వీట్‌షాప్‌లోకి దూసుకెళ్లిన సంఘటన జవహర్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని యాప్రాల్‌లో శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..వేగంగా వెళుతున్న ఓ కారు అదుపుతప్పి స్థానిక మోర్‌ సూపర్‌మార్కెట్‌ సమీపంలోని స్వీట్‌ హౌజ్‌లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో దుకాణం అద్దాలు, ఇతర వస్తువులు ధ్వంసమయ్యాయి.  జవహర్‌నగర్‌ పోలీసులు సంఘటనా స్ధలానికి చేరుకుని విచారణ చేపట్టారు. షాపింగ్‌కు వచ్చిన ఓ ఆర్మీ అధికారి భార్య   బ్రేక్‌ వేయబోయి అనుకోకుండా యాక్సిలేటర్‌ తొక్కడంతో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో ఎవరికీ ప్రమాదం జరగలేదు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top