గుట్ట ప్రసాదాల ధరలు పెంపు | By promontory to raise prices | Sakshi
Sakshi News home page

గుట్ట ప్రసాదాల ధరలు పెంపు

Feb 12 2015 3:08 AM | Updated on Jul 11 2019 5:38 PM

యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో లడ్డ్డూ, పులి హోర, వడ, దద్యోజనం ప్రసాదాల ధరలు పెరిగాయి.

యాదగిరికొండ: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో లడ్డ్డూ, పులి హోర, వడ, దద్యోజనం ప్రసాదాల ధరలు పెరిగాయి. ఒక్కో దానిపై రూ.5 చొప్పున పెంచారు. బుధవారం నుంచి పెంచిన ధరలను అమలు చేస్తున్నారు. 100 గ్రాముల లడ్డూ ధరను రూ.10 నుంచి రూ.15 పెంచారు. పెంచిన ధరతో లడ్డూ ప్రసాదంపై ప్రతినెలా రూ.17 లక్షల ఆదాయం సమకూరుతుంది. పులిహోర 200 గ్రాములున్న దానిని 250 గ్రాములకు పెంచి రూ.10 చేశారు. వడ ప్రసాదాన్ని పరిమాణం పెంచకుండానే రూ.15 చేశారు. దద్యోజనం రూ.5 నుంచి రూ.10 పెంచారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement