తండ్రి.. సోదరుడు తల్లిని తనకు కా కుండ చేస్తున్నారనే క్షణికావేశంలో సొంత అన్న ను కొట్టి చంపిన అన్నను పోలీసులు ఆదివా రం అరెస్ట్ చేశారు.
ఎల్లారెడ్డిపేట: తండ్రి.. సోదరుడు తల్లిని తనకు కా కుండ చేస్తున్నారనే క్షణికావేశంలో సొంత అన్న ను కొట్టి చంపిన అన్నను పోలీసులు ఆదివా రం అరెస్ట్ చేశారు. సిరిసిల్ల రూరల్ సీఐ రంగయ్యగౌడ్ స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో నిందితుడి వివరాలు వెల్లడించారు. ఎల్లారెడ్డిపేట మండలం దుమాలకు చెందిన కోనేటి రాజవ్వ-రాజయ్య దంపతులకు ముగ్గురు కొడుకులు దేవయ్య, కనకయ్య, రమేశ్ ఉన్నారు. నడిపి కుమారుడు కనకయ్య మేకలను తండ్రి రాజయ్య మేపుతుంటాడు.
ఇటీవల రాజయ్య రెండు రోజులు జ్వరంతో బాధపడ్డాడు. ఆ సమయములో కనకయ్య తన మేకలను తానే మేపుకున్నాడు. ఈ క్రమంలో కనకయ్య, దేవయ్య, తండ్రి రాజ య్యల మధ్య విభేదాలు చోటు చేసుకున్నాయి. ఈ నెల 11న సాయంత్రం తల్లి రాజవ్వకు కనకయ్య తన ఇంట్లో కల్లు తాగిస్తుండగా భర్త రాజయ్య, పెద్ద కుమారుడు దేవయ్య పసిగట్టి రాజవ్వతో వాగ్వాదానికి దిగారు. కనకయ్య ఇంటికి ఎందుకు వెళ్లావని కోపగించారు. మరోసారి ఆ ఇంటికి వెళ్లకూడదని హెచ్చరిం చారు.
దీంతో కోపోద్రిక్తుడైన కనకయ్య తల్లిని తనకుగాకుండా చూస్తున్నారని ఆగ్రహంతో ఇంట్లో ఉన్న రోకలిబండతో దేవయ్యపై దాడిచే సి తీవ్రంగా గాయపరిచాడు. దేవయ్యను ప్రథ మ చికిత్స అన ంతరం హైదరాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా ఈ నెల 16న మృతిచెందాడు. దేవయ్యను కొట్టి చంపిన కనకయ్యపై కేసు నమోదు చేసి హత్యకు ఉపయోగించిన రోకలిబండను స్వా ధీనం చేసుకుని అరెస్ట్ చేసినట్లు సీఐ తెలిపారు. సీఐ వెంట ఎస్సై నరేశ్‌కుమార్, ఏఎస్సైలు రవీందర్, మురళీ, దశరథం తదితరులు ఉన్నారు.