
కీచక ఉపాధ్యాయుడికి దేహశుద్ధి
విద్యార్థినితో అసభ్యకరంగా ప్రవర్తిస్తూ, చిత్రహింసలకు గురిచేస్తున్న ఉపాధ్యాయుడిని బాధితురాలి తల్లిదండ్రులు,
పాఠశాల ఫర్నిచర్ ధ్వంసం
పోలీసులకు అప్పగింత
తొర్రూరులో ఘటన
తొర్రూరుటౌన్ : విద్యార్థినితో అసభ్యకరంగా ప్రవర్తిస్తూ, చిత్రహింసలకు గురిచేస్తున్న ఉపాధ్యాయుడిని బాధితురాలి తల్లిదండ్రులు, బంధువులు చితకబాదిన సంఘటన మండల కేంద్రంలోని రత్న టెక్నో స్కూల్‌లో బుధవారం జరిగింది. ఈ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుడు ఆర్. రమేష్ అదే పాఠశాలలో చదివే విద్యార్థినితో రోజూ అసభ్యకరంగా ప్రవర్తించేవాడు. పాఠశాల సమయంలో అయిపోయాక కూడా క్లాస్‌లోనే ఉంచి చెప్పరాని చోటల్లా తాకుతూ ఇబ్బందికి గురిచేసేవాడు. ఈ బాధ భరించలేక బాధితురాలు తన తల్లిదండ్రులకు చెప్పడంతో వారు బు దవారం పాఠశాలకు చేరుకుని రమేష్‌ను చితకబాదారు.
పాఠశాల హెచ్‌ఎం అతడిని కాపాడే ప్రయత్నం చేయగా ఆగ్రహించిన కుటుంబ సభ్యులు పాఠశాలలోని ఫర్నీచర్ ను ధ్వంసం చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో వి ద్యార్థులు ఆందోళనకు గురై బోరున విలపించారు. పోలీ సులు రంగప్రవేశం చేసి నిందుతుడిని అదుపులోకి తీసుకున్నారు. ఇదిలా ఉండగా నిందితుడిపై నిర్భయ కేసు నమోదు చేసి, పాఠశాల గుర్తింపు రద్దు చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ మాజీ నాయకుడు మేకల కుమార్, పీడీఎస్‌యూ డివిజన్ నాయకుడు యాకయ్య, ఏఐపీఎస్‌యూ జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకట్‌రెడ్డి డిమాండ్ చేశారు.