బీజేపీని ఆదరించండి | BJP is development party | Sakshi
Sakshi News home page

బీజేపీని ఆదరించండి

Feb 23 2016 3:19 AM | Updated on Mar 29 2019 9:31 PM

బీజేపీని ఆదరించండి - Sakshi

బీజేపీని ఆదరించండి

అచ్చంపేట నగరపంచాయతీ ఎన్నికల్లో బీజేపీని ఆదరించాలని ఎమ్మెల్సీ రాంచందర్‌రావు ఓటర్లను కోరారు.

 ఎమ్మెల్సీ రాంచందర్‌రావు
అచ్చంపేట రూరల్: అచ్చంపేట నగరపంచాయతీ ఎన్నికల్లో బీజేపీని ఆదరించాలని ఎమ్మెల్సీ రాంచందర్‌రావు ఓటర్లను కోరారు. సోమవారం పట్టణంలోని వనవాసీ ప్రకల్ప వద్ద విలేకరులతో ఆయన మాట్లాడారు. అచ్చంపేటలో బీజేపీని ఆదరిస్తే మరింత అభివృద్ధి చెందుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వం అచ్చంపేటకు 900 ఇళ్లను మంజూరుచేసిందని గుర్తుచేశారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే నిర్మాణం ముందుకుసాగడం లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం అచ్చంపేటకు అధిక నిధులు కేటాయించే విధంగా కృషి చేస్తామన్నారు. నగరపంచాయతీ ఎన్నికల్లో నిలబడే తమ పార్టీ అభ్యర్థులను గెలుపించాలని కోరారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యదర్శి ఆచారి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ప్రజల సమస్యలను తీర్చడంలో విఫలమయిందన్నారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు రతంగ్‌పాండురెడ్డి, ప్రేమేందర్‌రెడ్డి, నాగూరావునామాజీ, బాలాజీ, మంగ్యానాయక్, గౌరీశంకర్, నాగరాజు, శ్రీనునాయక్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement