ఇంటి ముందు పార్క్ చేసిన బైక్ చోరీకి గురైన సంఘటన ఎల్‌బీనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
నాగోలు (హైదరాబాద్) : ఇంటి ముందు పార్క్ చేసిన బైక్ చోరీకి గురైన సంఘటన ఎల్‌బీనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం... కర్మన్‌ఘాట్‌కు చెందిన రవీందర్ సాగర్ రింగురోడ్డు సమీపంలోని శ్రీయా టిఫిన్ సెంటర్ వద్ద తన ద్విచక్ర వాహనాన్ని పార్క్ చేశాడు. కాగా గుర్తుతెలియని దుండగులు శనివారం రాత్రి వాహనాన్ని చోరీ చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు ఆదివారం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.