
పే..ద్ద ‘బొండా’
కొబ్బరిబొండా సాధారణంగా కేజీ నుంచి రెండు కేజీల వరకు ఉంటుంది.. కానీ.. వరంగల్ నగరంలోని పోచమ్మమైదాన్‌లో విఘ్నేశ్వర కొబ్బరిబొండాల యజమాని వద్ద దాదాపు 6 కేజీల బరువున్న బొండా ఉంది.
వరంగల్: కొబ్బరిబొండా సాధారణంగా కేజీ నుంచి రెండు కేజీల వరకు ఉంటుంది.. కానీ.. వరంగల్ నగరంలోని పోచమ్మమైదాన్‌లో విఘ్నేశ్వర కొబ్బరిబొండాల యజమాని వద్ద దాదాపు 6 కేజీల బరువున్న బొండా ఉంది.
20 ఏళ్లుగా వ్యాపారం చేస్తున్న తాను ఇంతవరకు ఇంత పెద్ద బొండా చూడలేదని, దీనిని బెంగళూరు నుంచి తెప్పించినట్లు చెప్పాడు. ఎవరికీ విక్రయించకుండా అందరికీ కనపడే విధంగా దుకాణం ఎదుట పెట్టాడు. దీనిని చూసి పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కాగా, బొండా పీచు తీసి దేవుడి వద్ద కొడతానని రవి చెప్పాడు.