మధులికపై దాడి కేసులో కొత్త విషయాలు  | Bharat Perfect Planned To Attack On Madhulika Says Police | Sakshi
Sakshi News home page

మధులికపై దాడి కేసులో కొత్త విషయాలు 

Feb 9 2019 7:01 PM | Updated on Feb 9 2019 8:47 PM

Bharat Perfect Planned To Attack On Madhulika Says Police - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: బర్కత్‌పురాలో ఇంటర్‌ విద్యార్థిని మధులికపై కత్తితో జరిగిన దాడి కేసులో కొత్త విష‌యాలు బయటకొస్తున్నాయి. ప్రణాళిక ప్రకారమే బాలికపై నిందితుడు భరత్‌ దాడికి పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. మధులిక 9వ తరగతి చదవుతున్నప్పటి నుంచే ప్రేమపేరుతో వెంటపడ్డానని పోలీసుల ముందు భరత్‌ ఒప్పుకున్నట్లు సమాచారం. (బుసలు కొట్టిన ప్రేమోన్మాదం)

ఈ మూడేళ్లలో మధులికకు భరత్‌ రెండు సార్లు ప్రపోజ్‌ చేశాడని, అమె నిరాకరించడంతోనే కోపం పెంచుకున్నట్లు తెలుస్తోంది. మధులిక విషయంలో ఆమె తల్లిదండ్రలు పలు మార్లు భరత్‌ను హెచ్చరించారనీ.. దాడి సమయంలో తనకు అడ్డు రాకుండా ఉండేందుకు ఆమె తల్లిదండ్రులను గదిలో బంధించి గడియ వేసి.. మధులికపై కొబ్బరి బోండాలు కొట్టే కత్తితో దాడి చేశాడనీ తెలుస్తోంది. హత్యాయత్నానికి ముందు కూడా భరత్‌తో బాలిక తండ్రి రాములు గొడవ పడ్డాడు. షీ టీమ్స్‌తో కౌన్సిలింగ్‌, ఘర్షణలు, ఫిర్యాదుల వీటన్నింటి కారణంగానే ద్వారా భరత్‌ మధులికపై విపరీతమైన కక్ష పెంచుకుని ఉంటాడనీ అందుకే ఇంత దారుణం చేసి ఉంటాడనీ పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరిన్ని ఆధారాల కోసం భరత్‌ వాడిన కత్తిని, బ్లడ్‌ శాంపిల్స్‌ను ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపించారు. (పుర్రె చీలిపోయి.. నరాలు తెగిపోయి..)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement