చలితో జాగ్రత్త! | Beware the chills! | Sakshi
Sakshi News home page

చలితో జాగ్రత్త!

Nov 20 2014 3:44 AM | Updated on Sep 2 2017 4:45 PM

చలితో జాగ్రత్త!

చలితో జాగ్రత్త!

చలికాలం ప్రారంభం నుంచి చర్మసంబంధిత, ఆస్తమా, దగ్గు, జలుబు, జ్వరం వంటి వ్యాధులు పెరిగాయి. ఈ కారణంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వచ్చే రోగుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది.

పెరుగుతున్న రోగులు
 చలికాలం ప్రారంభం నుంచి చర్మసంబంధిత, ఆస్తమా, దగ్గు, జలుబు, జ్వరం వంటి వ్యాధులు పెరిగాయి. ఈ కారణంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వచ్చే రోగుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. గతంలో 30 నుంచి 40 మధ్యలో రోగులు ఉండగా, ఇప్పుడు 40 నుంచి 80 వరకు వస్తున్నారు.
 
రక్షణ చర్యలు ఇవే
రోజూ సబ్బుతో కాకుండా సున్నిపిండితో స్నానం చేయాలి. అనంతరం పెట్రోలియం జెల్లీ, ఆలీవ్ ఆయిల్‌ను కాళ్లు, చేతులు, ముఖానికి రాసుకోవాలి. పెదాల రక్షణకు వెన్న, లిప్‌కేర్ తదితర క్రీములు ఉదయం, సాయంత్రం వాడాలి.

రాత్రుళ్లు వాహనాల్లో ప్రయాణం చేసేవారు స్వెట్టరు, మంకీ క్యాప్, చేతులకు బ్లౌజులు ధరించాలి. బయటకు వెళ్లేటప్పుడు సన్‌స్క్రీన్ లోషన్ రాసుకోవాలి. పేష్‌వాష్‌తో రోజూ ముఖం కడుక్కోవాలి.

చిన్నారులు, వృద్ధులు చలికి తట్టుకోలేరు. వారి శరీరమంత కప్పేలా దుస్తులు వేయాలి. ఉదయం 8 గంటల వరకు, సాయత్రం 7 గంటల తరువాత బయటకు వెళ్లనీయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.

 తాజా పండ్లు, కూరగాయలు, క్యారెట్ ఎక్కువగా తీసుకోవాలి. రోజుకు ఎనిమిది గ్లాసుల నీరు తాగాలి. ఉప్పు, చక్కెర, కొవ్వు కలిగి ఉండే పానీయాలు, ఆహారం తక్కువగా తీసుకోవాలి.
 
 ఆస్తమా ఎలా వస్తుంది ?
 ఊపిరి అందకపోవడం, ఆయాసం రావడం, వాతావరణ కాలుష్యం, పడని పదార్థాలు తినడం, ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్లు, పెంపుడు జంతువుల విసర్జన పదార్థాలు ఆస్తమా రావడానికి కారకాలు.
 
 జాగ్రత్తలు ఇలా..
 దుమ్ము, ధూళి, బ్యాక్టీరియా, ఫంగస్, ఎలర్జీకారకాలకు దూరంగా ఉండాలి. పొగ తాగవద్దు,పొగతో నిండిఉన్న గదుల్లో ఉండవద్దు. అనవసర శారీరక శ్రమ చెయ్యకూడదు.

కూల్‌డ్రింకులు, ఐస్‌క్రీములకు దూరంగా ఉండాలి. చలి, తేమను తప్పించుకుని వీలయినంత వరకు పరిశుభ్రమైన వాతవరణంలో ఉండాలి.

ఆస్తమా మందులు, ఇన్‌హేలర్లను ఎప్పుడూ వెంట ఉంచుకోవాలి. రాత్రిళ్లు నిద్రిస్తున్న సమయంలో తలవైపు దిండ్లు ఎత్తుగా అమర్చి వాటిని ఆనుకుని నిద్రపోవాలి.

వ్యాధి తీవ్రతను బట్టి వాతావరణాన్ని బట్టి రోజుకు రెండుసార్లు, మూడుసార్లు డాక్టర్ సూచించిన సిరప్ తీసుకోవాలి.

గట్టిగా శ్వాస పీల్చడం, వదలడం వంటి బ్రీతింగ్ ఎక్సర్‌సైజ్‌లు రెండు మూడు నిమిషాల పాటు చేయాలి. కాసేపాగి మళ్లీ మొదలు పెట్టాలి.

మెడిటేషన్, యోగా చేస్తే చాలావరకు ఉపశమనంగా ఉంటుంది. వాక్సిన్ వాడడంపై వ్యాధిని నివారించవచ్చు. డాక్టర్‌ను సంప్రదించిన తర్వాతే మందులు తీసుకోవాలి.
 
 దగ్గు నివారణకు...
 పొడి దగ్లు,  శ్లేష్మంతో కూడిన దగ్గు అని రెండు రకాలున్నాయి. వీటికి బాగా ద్రవాలు(తాగునీరు, టీ, సూపులు)తాగాలి. వేడి నీటి  ఆవిరి పట్టాలి. తీవ్రత ఎక్కువగా ఉంటే దగ్గరలోని డాక్టర్‌ను సంప్రదించాలి.
 
 అందుబాటులో మందులు
 తుమ్ములు, దగ్గు కోసం క్లోరోసిమిరామైన్, సిట్రోజిన్, సిరఫ్, ఆస్తమా, దమ్ము కోసం డెరిఫిలిన్, టాల్బుటమాన్, సిరఫ్, యాంటీబయాటిక్ మాత్రలు ఆక్సిమాలిన్, సిఫ్రోప్లాక్సిన్, సెఫిక్సిన్, చర్మ సంబంధిత వ్యాధులకు సిట్రోజిన్, బెటామిటర్‌టోన్ క్రీమ్ అందుబాటులో ఉన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement