breaking news
the number of patients
-
వ్యాధుల పంజా
మారుతున్న వాతావరణంతో పెరుగుతున్న అంటువ్యాధులు ఆస్పత్రుల్లో పెరుగుతున్న చికున్‌గన్యా, డెంగీ రోగుల సంఖ్య ఫాగింగ్ కూడా చేపట్టని అధికారులు రెండు నెలల్లో 374 చికున్ గన్యా, 548 డెంగీ కేసుల నమోదు బెంగళూరు: విజృంభిస్తున్న వర్షాలు, దోమల తీవ్రత, మారుతున్న వాతావరణ పరిస్థితుల కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా అంటువ్యాధులు ప్రబలుతున్నాయి. డెంగీ, చికున్ గన్యా లాంటి వ్యాధులకు చిక్కిన ప్రజలు ఆస్పత్రుల పాలవుతున్నారు. ఈ సంఖ్య నానాటికీ పెరుగుతోంది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో పాటు బెంగళూరు నగరంలోకూడా ఇదే పరిస్థితి నెలకొంది. బెంగళూరులోని వివిధ ప్రాంతాల్లో చెత్త నిర్వహణ అధ్వానంగా మారింది. పేరుకుపోతున్న చెత్త, ఇందుకు తోడవుతున్న చిరుజల్లులు వెరసి ఉద్యాననగరిలో దోమల స్వైరవిహారం పెరుగుతోంది. దీంతో నగరంలోని వివిధ ఆస్పత్రుల్లో చికున్‌గన్యా, డెంగీ తదితర సమస్యలతో ఇబ్పంది పడుతున్న వారు నగరంలోని ఆస్పత్రుల వద్ద క్యూకడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జనవరి నుంచి ఏప్రిల్ మధ్య కాలంలో 213 చికున్‌గన్యా కేసులు నమోదు కాగా, మే-జూన్ మధ్య ఈ సంఖ్య 374కు పెరిగింది. ఇక ఇదే సందర్భంలో రాష్ట్ర వ్యాప్తంగా జనవరి-ఏప్రిల్ మధ్య కాలంలో 468 డెంగీ కేసులు నమోదు కాగా, మే-జూన్ మధ్య కాలాంలో ఈ సంఖ్య 548కు పెరిగింది. బెంగళూరు నగరంలో సైతం పరిస్థితి ఇందుకు భిన్నంగా ఏమీ లేదు. జనవరి-ఏప్రిల్ మధ్య కాలంలో 24 చికున్ గన్యా కేసులు నమోదు కాగా, మే-జూన్ కాలానికి ఈ సంఖ్య 40కు పెరిగింది. ఇక జనవరి-ఏప్రిల్ మధ్య కాలంలో 29 డెంగీ కేసులు నమోదు కాగా, మే-జూన్ కాలానికి ఈ సంఖ్య 61కు పెరిగింది. కాగా, నగరంలో దోమల బెడద పెరిగిపోవడానికి బీబీఎంపీ నిర్లక్ష్యమే కారణమని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చెత్త నిర్వహణలో పూర్తిగా విఫలమైన బీబీఎంపీ కనీసం వర్షాకాలంలో దోమలు వృద్ధి చెందకుండా చేపట్టాల్సిన కార్యక్రమాలపై సైతం నిర్లక్ష్యం వహిస్తోందని చెబుతున్నారు. ఈ విషయంపై నగరంలోని హెచ్ఆర్బీఆర్ లే అవుట్‌కు చెందిన విక్రమ్ మాట్లాడుతూ....‘మా ప్రాంతంలో చెత్త నిర్వహణలో బీబీఎంపీ పూర్తిగా విఫలమైంది. మూడు నాలుగు రోజులకోసారి చెత్తను తొలగిస్తున్నారు. కురుస్తున్న వర్షానికి చెత్త తోడై మరీ ఎక్కువగా దోమలు వృద్ధి చెందుతున్నాయి. వాటి నివారణకు కనీసం ఫాగింగ్ కూడా చేయలేదు. జూన్ నెల ప్రారంభం నుంచి ఇప్పటి దాకా మా ప్రాంతంలో డెంగ్యీతో ఒకరు చనిపోగా, పది మంది ఆస్పత్రిలో చేరారు’ అని తెలిపారు. ఇక ఈ విషయంపై మస్కిటో కంట్రోల్ బీబీఎంపీ ప్రాజెక్టు కో-ఆర్డినేటర్ డాక్టర్ నవీన్ కుమార్ మాట్లాడుతూ....‘ఇప్పటికే నగరంలోని వివిధ ప్రాంతాల్లో దోమలు వృద్ధి చెందకుండా ఫాగింగ్ను ప్రారంభించాం. దోమలను నియంత్రించేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సైతం ప్రజల్లో అవగాహన కల్పించే కార్యక్రమాన్ని కూడా ప్రారంభించాం. 60శాతం మురికి వాడల్లో ఈ కార్యక్రమాలను ఇప్పటికే పూర్తి చేశాం’ అని చెప్పారు. -
చలితో జాగ్రత్త!
పెరుగుతున్న రోగులు చలికాలం ప్రారంభం నుంచి చర్మసంబంధిత, ఆస్తమా, దగ్గు, జలుబు, జ్వరం వంటి వ్యాధులు పెరిగాయి. ఈ కారణంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వచ్చే రోగుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. గతంలో 30 నుంచి 40 మధ్యలో రోగులు ఉండగా, ఇప్పుడు 40 నుంచి 80 వరకు వస్తున్నారు. రక్షణ చర్యలు ఇవే రోజూ సబ్బుతో కాకుండా సున్నిపిండితో స్నానం చేయాలి. అనంతరం పెట్రోలియం జెల్లీ, ఆలీవ్ ఆయిల్‌ను కాళ్లు, చేతులు, ముఖానికి రాసుకోవాలి. పెదాల రక్షణకు వెన్న, లిప్‌కేర్ తదితర క్రీములు ఉదయం, సాయంత్రం వాడాలి. రాత్రుళ్లు వాహనాల్లో ప్రయాణం చేసేవారు స్వెట్టరు, మంకీ క్యాప్, చేతులకు బ్లౌజులు ధరించాలి. బయటకు వెళ్లేటప్పుడు సన్‌స్క్రీన్ లోషన్ రాసుకోవాలి. పేష్‌వాష్‌తో రోజూ ముఖం కడుక్కోవాలి. చిన్నారులు, వృద్ధులు చలికి తట్టుకోలేరు. వారి శరీరమంత కప్పేలా దుస్తులు వేయాలి. ఉదయం 8 గంటల వరకు, సాయత్రం 7 గంటల తరువాత బయటకు వెళ్లనీయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. తాజా పండ్లు, కూరగాయలు, క్యారెట్ ఎక్కువగా తీసుకోవాలి. రోజుకు ఎనిమిది గ్లాసుల నీరు తాగాలి. ఉప్పు, చక్కెర, కొవ్వు కలిగి ఉండే పానీయాలు, ఆహారం తక్కువగా తీసుకోవాలి. ఆస్తమా ఎలా వస్తుంది ? ఊపిరి అందకపోవడం, ఆయాసం రావడం, వాతావరణ కాలుష్యం, పడని పదార్థాలు తినడం, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్లు, పెంపుడు జంతువుల విసర్జన పదార్థాలు ఆస్తమా రావడానికి కారకాలు. జాగ్రత్తలు ఇలా.. దుమ్ము, ధూళి, బ్యాక్టీరియా, ఫంగస్, ఎలర్జీకారకాలకు దూరంగా ఉండాలి. పొగ తాగవద్దు,పొగతో నిండిఉన్న గదుల్లో ఉండవద్దు. అనవసర శారీరక శ్రమ చెయ్యకూడదు. కూల్డ్రింకులు, ఐస్‌క్రీములకు దూరంగా ఉండాలి. చలి, తేమను తప్పించుకుని వీలయినంత వరకు పరిశుభ్రమైన వాతవరణంలో ఉండాలి. ఆస్తమా మందులు, ఇన్హేలర్లను ఎప్పుడూ వెంట ఉంచుకోవాలి. రాత్రిళ్లు నిద్రిస్తున్న సమయంలో తలవైపు దిండ్లు ఎత్తుగా అమర్చి వాటిని ఆనుకుని నిద్రపోవాలి. వ్యాధి తీవ్రతను బట్టి వాతావరణాన్ని బట్టి రోజుకు రెండుసార్లు, మూడుసార్లు డాక్టర్ సూచించిన సిరప్ తీసుకోవాలి. గట్టిగా శ్వాస పీల్చడం, వదలడం వంటి బ్రీతింగ్ ఎక్సర్సైజ్లు రెండు మూడు నిమిషాల పాటు చేయాలి. కాసేపాగి మళ్లీ మొదలు పెట్టాలి. మెడిటేషన్, యోగా చేస్తే చాలావరకు ఉపశమనంగా ఉంటుంది. వాక్సిన్ వాడడంపై వ్యాధిని నివారించవచ్చు. డాక్టర్‌ను సంప్రదించిన తర్వాతే మందులు తీసుకోవాలి. దగ్గు నివారణకు... పొడి దగ్లు, శ్లేష్మంతో కూడిన దగ్గు అని రెండు రకాలున్నాయి. వీటికి బాగా ద్రవాలు(తాగునీరు, టీ, సూపులు)తాగాలి. వేడి నీటి ఆవిరి పట్టాలి. తీవ్రత ఎక్కువగా ఉంటే దగ్గరలోని డాక్టర్‌ను సంప్రదించాలి. అందుబాటులో మందులు తుమ్ములు, దగ్గు కోసం క్లోరోసిమిరామైన్, సిట్రోజిన్, సిరఫ్, ఆస్తమా, దమ్ము కోసం డెరిఫిలిన్, టాల్బుటమాన్, సిరఫ్, యాంటీబయాటిక్ మాత్రలు ఆక్సిమాలిన్, సిఫ్రోప్లాక్సిన్, సెఫిక్సిన్, చర్మ సంబంధిత వ్యాధులకు సిట్రోజిన్, బెటామిటర్టోన్ క్రీమ్ అందుబాటులో ఉన్నాయి.